Sangameshwara Temple: శ్రీశైలం జలాశయానికి వరద..జలాధివాసంలో సంగమేశ్వరుడు

Sangameshwara Temple: ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణానదికి వరద ఉదృతి పెరిగింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరిగిపోవడంతో కృష్ణా జలాలు సంగమేశ్వరాలయంలోని వేపదారి శివలింగాన్ని తాకాయి. ఆలయ పూజారి తెలకపల్లి రఘువర్మ శాస్త్రి కృష్ణమ్మ చీరసారే పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 885అడుగులు కాగా..ప్రస్తుతం 839అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయానికి వర్షకాలంలో వరద పోటెత్తనుండటంతో సంగమేశ్వరడు ప్రతియేట 8 నెలలు జలాశయంలో జలధివాసంలో ఉండిపోవడం జరుగుతుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
జలాశయం పరిధిలోని సంగమేశ్వర ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఉంది. వరదల కారణంగా ఏటా సంగమేశ్వరుడి ఆలయం నీట మునుగతున్నప్పటికి సాధారణ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శిస్తుంటారు.