Motkupalli | మోత్కుపల్లికి టికెట్ ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌కు అనుచరుల వినతి.!

Motkupalli | విధాత : మాజీమంత్రి బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేదా రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన అనుచరులు సీఎం కేసీఆర్ కు విన్నవించారు. గురువారం యాదగిరిగుట్టలో సమావేశమైన మోత్కుపల్లి అనుచరులు ఈ మేరకు తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు పంపించారు. ఆలేరు టికెట్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి కేటాయించే క్రమంలో సీఎం కేసీఆర్ తనతో […]

  • Publish Date - August 24, 2023 / 01:24 AM IST

Motkupalli | విధాత : మాజీమంత్రి బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేదా రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన అనుచరులు సీఎం కేసీఆర్ కు విన్నవించారు. గురువారం యాదగిరిగుట్టలో సమావేశమైన మోత్కుపల్లి అనుచరులు ఈ మేరకు తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు పంపించారు.

ఆలేరు టికెట్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి కేటాయించే క్రమంలో సీఎం కేసీఆర్ తనతో మాటమాత్రమైన సంప్రదించకపోవడం మోత్కుపల్లిని అసంతృప్తికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు యాదగిరిగుట్టలో సమావేశమై మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. ఆయనకు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు తీర్మానం లేఖ ద్వారా కోరారు. దళిత బంధు పథకం రూపకల్పన అమలు సందర్భంగా మీ సహకారం కావాలంటూ సీఎం కేసీఆర్ ఆహ్వానించడంతో మోత్కుపల్లి బీఆర్ఎస్ లో చేరారని లేఖలో పేర్కొన్నారు.

పార్టీలో చేరినప్పుడు మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్తును నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారులో మాత్రం అవకాశం కల్పించకపోవడం తమను బాధించిందన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా దళితనేత గెలవడం ఎంత కష్టమో మీకు తెలుసని, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన నిజాయితీపరుడని ఆయనను ప్రజా జీవితం నుంచి కనుమరుగు చేయడం సమంజసం కాదన్నారు. మిమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లికి అదే స్థాయిలో గౌరవించి ఉంటే దళిత బహుజన వర్గాల్లో సంతోషం వ్యక్తం అయ్యేదన్నారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో ఎక్కడైనా మోత్కుపల్లికి పార్టీ టికెట్ ఇవ్వాలని వారు లేఖలో కోరారు. తాము సీఎం కేసీఆర్ కి గాని, సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి గాని వ్యతిరేకంగా సమావేశం పెట్టలేదన్నారు. మోత్కుపల్లికి తగిన న్యాయం చేయాలని ఈ సమావేశం ద్వారా సీఎం కేసీఆర్ ను కోరుతున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి ముఖ్య అనుచరులు గిరెడ్డి ముకుందా రెడ్డి, సగరపు ప్రసాద్, కేవిఎల్. రావు, పల్లె కృష్ణ, ఇస్తారి సహా మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు.