‘డబుల్’ ఇండ్ల కోసం మాజీ కలెక్టర్ పోరాటం.. అరెస్టు చేసిన పోలీసులు

హామీ ఇచ్చేదాకా కదలనన్న ఆకునూరి అరెస్టు చేసిన పోలీసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆందోళన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూ వేషాలపల్లె గ్రామస్తులు మాజీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లోకి చొచ్చుకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణం జరిగి నాలుగేళ్ళు పూర్తయినా లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించనందున పేదలు మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గతంలో మురళి […]

  • By: Somu    latest    Jan 30, 2023 11:34 AM IST
‘డబుల్’ ఇండ్ల కోసం మాజీ కలెక్టర్ పోరాటం.. అరెస్టు చేసిన పోలీసులు
  • హామీ ఇచ్చేదాకా కదలనన్న ఆకునూరి
  • అరెస్టు చేసిన పోలీసులు
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆందోళన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూ వేషాలపల్లె గ్రామస్తులు మాజీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లోకి చొచ్చుకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణం జరిగి నాలుగేళ్ళు పూర్తయినా లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించనందున పేదలు మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గతంలో మురళి ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

వందలాది మంది పేదలు తమ పిల్ల పాపలతో కలిసి ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే దాకా కదిలేది లేదని అక్కడే మురళితో పాటు బాధితులు బైఠాయించారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి భూపాలపల్లి పట్టణంలో వేషాలపల్లె గ్రామస్తులతో కలిసి ఆందోళన చేశారు దీంతో మురళిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇదిలాఉండగా.. వేషాలపల్లిలో నాలుగేళ్ల క్రితం నిర్మించిన 544 ఇండ్లను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయలేదు. ఇప్పటికీ ఇంకా లబ్దిదారుల లిస్ట్ ఫైనల్ చేయలేదు. విసిగిపోయిన పేదలు కట్టిన ఇండ్లను ఆక్రమించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి పేదలను ఇళ్లనుంచి ఖాళీ చేయించారు. వీరికి మద్దతుగా కొందరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.