AP |
విధాత: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని, పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమోందించడమే లక్ష్యమని, మూడు పార్టీలు కలుస్తాయని కేంద్రం కూడా సంకేతాలు ఇచ్చిందన్నారు.
కేంద్రమంత్రి నారాయణస్వామి కూడా పొత్తులపై స్పష్టతిచ్చారన్నారు.శ్రీకాళహస్తిలో అమిత్ షా కూడా వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్రం సంకేతాలు లేకుంటే నేనెందుకు ప్రస్తావిస్తానన్నారు. జగన్‍కు కేంద్రం నుంచి ఎలాంటి అండదండల్లేవని, సీబీఐ కేసులో కేంద్రం అండగా ఉందనేది అపోహేనని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.