Free Electricity | పవర్.. పాలి’ట్రిక్స్’
Free electricity ఉచిత విద్యుత్‌పై బీఆర్ ఎస్.. కాంగ్రెస్ నిరసనల హోరు పోటాపోటీగా నిరసనలు.. నిందారోపణలు విధాత: పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ పథకంపై చేసిన వ్యాఖ్యల చుట్టూ బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రేగిన రచ్చ బుధవారం రెండు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోటాపోటీ నిరసనలతో మరింత రక్తికట్టింది. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలకు దిగగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో నిరసనల్లో పాల్గొని […]

Free electricity
- ఉచిత విద్యుత్‌పై బీఆర్ ఎస్.. కాంగ్రెస్ నిరసనల హోరు
- పోటాపోటీగా నిరసనలు.. నిందారోపణలు
విధాత: పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ పథకంపై చేసిన వ్యాఖ్యల చుట్టూ బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రేగిన రచ్చ బుధవారం రెండు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోటాపోటీ నిరసనలతో మరింత రక్తికట్టింది.
రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలకు దిగగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో నిరసనల్లో పాల్గొని కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అంటు.. ఆ పార్టీకి అధికారమిస్తే రైతాంగానికి నిరంతర ఉచిత విద్యుత్ పథకం ఎత్తివేస్తుందంటు విమర్శలు గుప్పించారు. రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
జిల్లాలు, మండల కేంద్రాలలో బీఆర్‌ఎస్ ధర్నాలతో హోరెత్తించింది. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సబ్ స్టేషన్ల వద్ధ ధర్నాలు నిర్వహించాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం లేదంటు ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 24గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందుతుందని ఆ పార్టీ నాయకులు తమ వాదనలను ప్రజల ముందు ఏకరవు పెట్టారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తు బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందంటు ఎదురుదాడికి దిగారు. బీఆర్‌ఎస్ విద్యుత్ సౌదా వద్ధ నిరసనలో ఎమ్మెల్సీ కవిత, ఖమ్మంలో కాంగ్రెస్ ధర్నాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
రేవంత్‌ను తరిమికొట్టాలి: ఎమ్మెల్సీ కవిత
రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తు విద్యుత్ సౌదా వద్ధ జరిగిన బీఆర్‌ఎస్ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, దానం నాగేందర్‌లు హాజయ్యారు. ధర్నాలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతు రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న రేవంత్‌రెడ్డిని తరిమికొట్టాలంటు పిలుపునిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ బోగస్ అని తెలంగాణ రైతులకు అర్ధమవుతుందంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణ రైతులకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎందుకని రేవంత్ అడుగుతున్నాడని, మరి వ్యాపార వేత్తలకు, జూబ్లిహీల్స్‌లోని రేవంత్ ఇంటికి ఇవ్వాలా అంటు ఫ్రశ్నించారు. రేవంత్ ఆమెరికాలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయకు వ్యవసాయంపై అవగాహాన లేదని వెల్లడవుతుందన్నారు.
60ఏళ్లలో కాంగ్రెస్ పాలకులు ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్త చేస్తే గత తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారన్నారు. లక్ష కోట్లతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందన్నారు.
ఫలితంగానే వరి పంటలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుందన్నారు.తెలంగాణలో ఇప్పటికి 27.5లక్షల బోరుబావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నందునా ఉచిత విద్యుత్ పథకం వారికి ఎంతో అవసరమన్నారు.
మూడు చెరువుల నీళ్లు తాగినా అధికారంలోకి రారు: రేవంత్‌రెడ్డి
24గంటల ఉచిత విద్యుత్ పథకంపై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తు బీఆరెఎస్ రాజకీయం చేస్తుందంటు మండిపడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ట్వీట్టర్‌లో ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల అన్నా చెల్లెల్లు మూడు గంటలు అని దుష్ప్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా మీరు మూడోసారి అధికారంలోకి రావడం కల్లా అంటు ట్వీట్ చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
24గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ అందిస్తుంది: మాణిక్‌రావ్ ఠాక్రే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మణిక్‌రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పిందో అవన్ని అమలు చేస్తామన్నారు. 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందన్న భయంతోనే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారానికి దిగిందన్నారు.