Gadwala | గద్వాల జిల్లా.. అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యింది: రేవంత్‌ రెడ్డి

Gadwala కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ విధాత: గద్వాలా జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని, గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పరోక్షంగా బీజేపీ నేత, మాజీ మంత్రి డీకె అరుణపై విమర్శలు చేశారు. ఇటీవల బీఆర్ ఎస్‌కు రాజీనామా చేసిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్‌ సరితా తిరుపతితో పాటు బండ్ల చంద్రశేఖర్‌ సహా పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు సహా పెద్ద […]

Gadwala  | గద్వాల జిల్లా.. అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యింది: రేవంత్‌ రెడ్డి

Gadwala

  • కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌

విధాత: గద్వాలా జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని, గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పరోక్షంగా బీజేపీ నేత, మాజీ మంత్రి డీకె అరుణపై విమర్శలు చేశారు.

ఇటీవల బీఆర్ ఎస్‌కు రాజీనామా చేసిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్‌ సరితా తిరుపతితో పాటు బండ్ల చంద్రశేఖర్‌ సహా పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు సహా పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌లో ఆదివారం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి రేవంత్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతు గద్వాల జిల్లా ఆది నుండి కాంగ్రెస్‌ కంచుకోటగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌కు తన పాలన పట్ల నమ్మకముంటే సిటింగ్‌లందరికి మళ్లీ టికెట్లు ఇవ్వాలని, తాను గజ్వేల్‌ నుండే మళ్లీ పోటీ చేయాలని రేవంత్‌ మరోసారి డిమాండ్‌ చేశారు.