చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గృహ నిర్బంధం..! పదవి నుంచి తొలగింపు?
విధాత: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) చీఫ్ పదవి నుంచి కూడా తొలగించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండు వార్తలను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అధికారులు కానీ ధృవీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా సైన్యం దేశ రాజధాని బీజింగ్ దిశగా కదులుతున్నట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బీజింగ్ వైపు 50 […]

విధాత: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) చీఫ్ పదవి నుంచి కూడా తొలగించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండు వార్తలను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అధికారులు కానీ ధృవీకరించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో చైనా సైన్యం దేశ రాజధాని బీజింగ్ దిశగా కదులుతున్నట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బీజింగ్ వైపు 50 వేల మంది పీపీఏ సైన్యం వెళ్తుందని, ఆ ప్రాంతంలో సైనిక వాహనాలే కనిపిస్తున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో చైనాలో ఏదో జరుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి.
అయితే చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైకి మాత్రమే నవ్వుతూ ఉంటారని, లోపల మాత్రం చాలా క్రూరంగా ఉంటారని పలువురు పేర్కొంటున్నారు.
ఆయన నియంత పోకడలను నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుబాటు వచ్చిందని తెలుస్తోంది. జిన్‌పింగ్ ఇటీవల సమర్‌కండ్‌లో ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకులు ఆయనను ఆర్మీ చీఫ్ పదవి నుండి తొలగించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
జిన్ పింగ్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలో తీర్మానం జరిగిందని అంటున్నారు. ఎందుకంటే.. అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష, నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించారు.
పలు కథనాలు ఈ ఆరుగురిని జిన్‌పింగ్‌కు రాజకీయ ప్రత్యర్థులుగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌పై పార్టీ సీనియర్లు తిరుగుబాటు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిన్ పింగ్ ను సైన్యం హౌజ్ అరెస్ట్ చేసిందని తెలుస్తోంది.