రాహుల్‌ను హత్తుకొని ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్
విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని తమ మద్దతును ప్రకటిస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో కొందరు అమ్మాయిలు జాయిన్ అయ్యారు. రాహుల్ నడక సాగిస్తుంటే.. ఆయన పక్కనే ఉన్న ఓ అమ్మాయి తీవ్ర భావోద్వేగానికి గురైంది. గట్టిగా ఏడ్చేసింది. […]

విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని తమ మద్దతును ప్రకటిస్తున్నారు.
రాహుల్ పాదయాత్రలో కొందరు అమ్మాయిలు జాయిన్ అయ్యారు. రాహుల్ నడక సాగిస్తుంటే.. ఆయన పక్కనే ఉన్న ఓ అమ్మాయి తీవ్ర భావోద్వేగానికి గురైంది. గట్టిగా ఏడ్చేసింది. ఎగిరి గంతేసేందుకు ప్రయత్నించింది. తన ఆనందాన్ని ఆ అమ్మాయి ఆపులేకపోయింది.
దీంతో రాహుల్ ఆమెను హత్తుకున్నాడు. ఆ సమయంలో బాలిక మరింత భావోద్వేగానికి లోనై.. రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర జమ్మూకశ్మీర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర కేరళ రాష్ట్రంలోని సెప్టెంబర్ 10వ తేదీన ప్రవేశించింది. కేరళలో 450 కి.మీ. మేర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.