హైదరాబాద్‌లో దారుణం.. స్కూల్లో 4 ఏండ్ల బాలికపై లైంగిక దాడి
Hyderabad | అభం శుభం తెలియని ఓ నాలుగేండ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. స్కూల్లోనే ఆ పాపపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నారి ప్రవర్తనలో తేడా రావడం, స్కూల్ కు వెళ్లనని చెప్పడంతో.. ఏమైందని తల్లి అడగ్గా అసలు విషయం బయటపడింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు తేలింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రయివేటు స్కూల్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. తమ […]

Hyderabad | అభం శుభం తెలియని ఓ నాలుగేండ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. స్కూల్లోనే ఆ పాపపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నారి ప్రవర్తనలో తేడా రావడం, స్కూల్ కు వెళ్లనని చెప్పడంతో.. ఏమైందని తల్లి అడగ్గా అసలు విషయం బయటపడింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు తేలింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రయివేటు స్కూల్లో చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. తమ పాపకు నాలుగేండ్ల వయసు. ఈ ఏడాది జూన్ నుంచి స్కూల్ కు వెళ్తుంది. కానీ నాలుగైదు రోజుల నుంచి స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడుతోంది. ఏడ్చేస్తుంది. ఏమైందని ఆరా తీయగా.. ప్రిన్సిపల్ డ్రైవర్ క్లాస్ రూమ్ లోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగికదాడికి పాల్పడినట్లు పాప చెప్పింది. గత రెండు నెలల నుంచి ప్రిన్సిపల్ డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలిందని తల్లి చెప్పింది.
ఇక చిన్నారి తల్లిదండ్రులు నిన్న ఆ స్కూల్ వద్దకు వెళ్లి ప్రిన్సిపల్ డ్రైవర్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. స్కూల్ ప్రిన్సిపల్ పై కూడా పేరెంట్స్ దాడి చేశారు. ఇలాంటి వ్యక్తులను పనిలో పెట్టుకుంటారా? అని మహిళా ప్రిన్సిపాల్ ను పేరెంట్స్ ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు.. డ్రైవర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రజనీకుమార్ గత రెండు నెలల నుంచి మిగతా చిన్నారులతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.