Viral Video | వేగంగా దూసుకొచ్చిన జేసీబీ.. తోబుట్టువుల‌ను కాపాడుకున్న చిన్నారి

Viral Video | ఇంటి ముందున్న ర‌హ‌దారిపై ఓ అమ్మాయి త‌న ఇద్ద‌రు తోబుట్టువుల‌తో ఆడుకుంటుంది. ఆ ప‌క్క‌నే బ్రిడ్జి నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వైపున‌కు ఓ జేసీబీ దూసుకొచ్చింది. అప్ర‌మ‌త్త‌మైన చిన్నారి త‌న తోబుట్టువుల‌ను కాపాడుకునేందుకు జేసీబీకి రెండు చేతుల‌ను అడ్డుగా పెట్టి ఆపింది. జేసీబీ డ్రైవ‌ర్ ఆ పిల్ల‌ల‌ను గ‌మ‌నించి వాహ‌నాన్ని ఆపాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు చిన్నారుల‌ను ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిని ఇంట్లోకి పంపించి తాను వెళ్లిపోయింది. […]

  • Publish Date - December 15, 2022 / 04:58 AM IST

Viral Video | ఇంటి ముందున్న ర‌హ‌దారిపై ఓ అమ్మాయి త‌న ఇద్ద‌రు తోబుట్టువుల‌తో ఆడుకుంటుంది. ఆ ప‌క్క‌నే బ్రిడ్జి నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వైపున‌కు ఓ జేసీబీ దూసుకొచ్చింది. అప్ర‌మ‌త్త‌మైన చిన్నారి త‌న తోబుట్టువుల‌ను కాపాడుకునేందుకు జేసీబీకి రెండు చేతుల‌ను అడ్డుగా పెట్టి ఆపింది. జేసీబీ డ్రైవ‌ర్ ఆ పిల్ల‌ల‌ను గ‌మ‌నించి వాహ‌నాన్ని ఆపాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు చిన్నారుల‌ను ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిని ఇంట్లోకి పంపించి తాను వెళ్లిపోయింది. అనంత‌రం జేసీబీ వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

త‌న తోబుట్టువుల‌ను సుర‌క్షితంగా ఇంట్లోకి పంపించిన చిన్నారిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నాలుగైదేండ్ల వ‌య‌సున్న ఆ చిన్నారి త‌న కంటే చిన్న‌వారిని కాపాడిన తీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఆ బాలికకు పెద్ద హ‌గ్ ఇవ్వాల‌ని ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ అన్నారు.