విధాత: అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే సమావేశం కాబోతున్నది. త్వరలోనే వడ్డీరేట్లను సవరించనున్నారనే అంచనాలున్నాయి. మరో వైపు యూస్ డాలర్ బలపడుతున్నది. ఈ నేపథ్యంలో పసిడి భారీగా పతనమవుతున్నది. ప్రస్తుతం ఔన్స్ 1,866 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. అయితే, దేశంలో బంగారం ధరలు సైతం తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి.
నిన్నటి భారీగా తగ్గిన బంగారం ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్లపై స్వర్ణం రూ.58,530 పలుకుతున్నది. మరో వైపు వెండి సైతం నిలకడగా ఉన్నది. కిలోకు రూ.73,500 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.రూ.58,350 వద్ద కొనసాగుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.58,200 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,450 వద్ద స్థిరంగా ఉన్నది. కేరళలో 22 క్యారెట్ల పసిడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,200 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల రూ.58,200 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.58,200 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి కిలోకు రూ.76వేల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు ప్లాటినంపై తులానికి రూ.210 వరకు తగ్గింది. ప్రస్తుతం తులానికి రూ.24,160 వద్ద కొనసాగుతున్నది.