Gold Prices: మూడు రోజులుగా పసిడి నిలకడ..!

Reported by: Y.V. Narsimha Reddy | latest | Apr 27, 2025, 11:29 am IST
Read Time: 2 mins
Gold Prices: మూడు రోజులుగా పసిడి నిలకడ..!

Gold Prices:  తులం బంగారం ధర లక్ష దాటేసి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన తర్వాతా స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు వరుసగా మూడు రోజులు నిలకడగా ఉండటం విశేషం. ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.90,120వద్ధ కొనసాగుతోంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 98,210వద్ధ ఉంది. బెంగుళూర్, చైన్నై, ముంబైలలో అదే ధర కొనసాగుతోంది. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు 90,170, 24క్యారెట్లకు 98,310వద్ధ కొనసాగుతోంది.

దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.86,068, 24క్యారెట్లకు రూ. 92,984గాకొనసాగుతోంది. అమెరికాలో రూ.85,812, రూ.91,362గా ఉంది.

వెండి ధరలు కూడా వరుసగా మూడు రోజులు నిలకడగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,11,900వద్ధ కొనసాగుతోంది.