Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold Prices: పసిడి ధరలు మరోసారి పైకి ఎగిశాయి. శుక్రవారం హైదారాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,100పెరిగి రూ.87,200వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,200పెరిగి రూ.95,130వద్ధ కొనసాగుతుంది. బెంగుళూరు, ముంబై, చెన్నైలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,530, 24క్యారెట్లకు రూ.95,280గా ఉంది.

దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 83,692లు , 24క్యారెట్లకు రూ.90,331గా కొనసాగుతున్నాయి. అమెరికాలో 22క్యారెట్లకు రూ.83,866, 24క్యారెట్లకు రూ.89,428గా కొనసాగుతుంది. ఇక వెండి ధరలు మార్కెట్ లో నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.1,08,000వద్ధ కొనసాగుతుంది.