Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Reported by: Y.V. Narsimha Reddy | latest | May 07, 2025, 11:31 am IST
Read Time: 2 mins
Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices: : బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500పెరిగి రూ.90,750వద్ధ ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.540పెరిగి రూ.99,000వద్ధ కొనసాగుతోంది. బెంగుళూరు, చైన్నై, ముంబైలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.90,900, 24క్యారెట్లకు రూ.99,150వద్ధ కొనసాగుతోంది.

దుబాయ్ లో 22క్యారెట్లకు రూ. 87,100, 24క్యారెట్లకు రూ. 94,079 గా ఉన్నాయి. అమెరికాలో రూ.87,271, రూ.93,202వద్ధ కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.3,100పెరిగి రూ. 1,11,000గా ఉంది.