మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పం తగ్గిన బంగారం.. రూ.1200 తగ్గిన వెండి..!

బంగారం ధరలు ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పం తగ్గిన బంగారం.. రూ.1200 తగ్గిన వెండి..!

Gold Rates | బంగారం ధరలు ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా మూడో రోజులు పెరిగిన పసిడి ధరలు శనివారం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 తగ్గి.. తులానికి రూ.58,550 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 పతనమై తులానికి రూ.63,870 పలుకుతున్నది.


మరో వైపు బంగారం ధర భారీగానే తగ్గింది. రూ.1200 వరకు తగ్గి కిలోకు రూ.78,300కు చేరింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,970కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.59,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,470కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,870కి దిగివచ్చింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,870 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఒక వెండి ధర భారీగానే తగ్గుముఖం పట్టింది. రూ.1200 తగ్గి కిలో వెండి రూ.78,300 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79,700 దిగివచ్చింది. ఇదిలా ఉండగా.. ప్లాటినం ధర స్వల్పంగా పెరిగింది. రూ.110 పెరిగి తులం రూ.27,050కి ఎగిసింది.