Mynampally | టికెట్ వచ్చింది.. మైనంపల్లి స్వరం మారింది

Mynampally | మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్‌ విధాత: మల్కాజిగిరిలో తనతో పాటు, మెదక్‌లో తన కుమారుడికి బీఆరెస్ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం తన కుమారుడికి టికెట్ రాకుండా మంత్రి టి.హరీశ్‌రావు అడ్డుపడ్డారంటు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం రేగింది. అయితే బీఆరెస్ తొలి జాబితా పిదప ఆయన తన స్వరం మార్చుకున్నారు. హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర విమర్శలు చేసినప్పటికి సీఎం కేసీఆర్ […]

Mynampally | టికెట్ వచ్చింది.. మైనంపల్లి స్వరం మారింది

Mynampally |

  • మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్‌

విధాత: మల్కాజిగిరిలో తనతో పాటు, మెదక్‌లో తన కుమారుడికి బీఆరెస్ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం తన కుమారుడికి టికెట్ రాకుండా మంత్రి టి.హరీశ్‌రావు అడ్డుపడ్డారంటు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం రేగింది. అయితే బీఆరెస్ తొలి జాబితా పిదప ఆయన తన స్వరం మార్చుకున్నారు.

హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర విమర్శలు చేసినప్పటికి సీఎం కేసీఆర్ ఆయనకు తొలి జాబితాలో టికెట్ కేటాయించారు. దీంతో చల్లబడిన మైనంపల్లి తనకు టికెట్ వచ్చినందుకు నియోజకవర్గంలో సంబరాలు జరుపాలంటు కేడర్‌కు సూచించారు. బీఆరెస్ తరుపునే మళ్లీ పోటీచేస్తానంటు స్పష్టం చేశారు. కాగా హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్ ఖండించారు.