Governor Tamilisai | రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు గ్యాప్ లేదు: గవర్నర్ తమిళ సై
Governor Tamilisai కోర్టు కేసులతో, ప్రోటోకాల్ రూల్స్‌తో నన్ను కట్టడి చేయలేరు గవర్నర్ తమిళ సై ఆసక్తికర వ్యాఖ్యలు నాలుగేళ్ల పదవి కాలం పూర్తిపై సంతృప్తి విధాత: తెలంగాణ గవర్నర్ తమిళ సై తన నాలుగేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు నా బాధ్యతలు, రాజ్యంగ విధులు నాలుగేళ్ల నా పదవి కాలంలో సమర్ధవంవతంగా నిర్వహించానన్నారు. నేను ఎక్క డ ఉన్న […]

Governor Tamilisai
- కోర్టు కేసులతో, ప్రోటోకాల్ రూల్స్‌తో నన్ను కట్టడి చేయలేరు
- గవర్నర్ తమిళ సై ఆసక్తికర వ్యాఖ్యలు
- నాలుగేళ్ల పదవి కాలం పూర్తిపై సంతృప్తి
విధాత: తెలంగాణ గవర్నర్ తమిళ సై తన నాలుగేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు నా బాధ్యతలు, రాజ్యంగ విధులు నాలుగేళ్ల నా పదవి కాలంలో సమర్ధవంవతంగా నిర్వహించానన్నారు. నేను ఎక్క డ ఉన్న తెలంగాణతో ఉన్న బంధం మరిచిపోనన్నారు. నాది మోసం చేసే మనస్తత్వం కాదన్నారు.
సవాళ్లకు, పంతాలకు భయపడనని, కోర్టు కేసులు, ప్రోటోకాల్ నిబంధనలతో, కు విమర్శలతో నన్ను కట్టడి చేయలేరన్నారు. బిల్లుల విషయంలో అభిప్రాయ భేదాలుంటాయని, ఫైటింగ్ కాదన్నారు. నేను రాజకీయాలు చేయడం లేదన్నారు. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ లేదన్నారు. సీఎంతో నాకు ఎలాంటి దూరం లేదన్నారు. దూరం గురించి నేను పట్టించుకోనన్నారు. నేను నామార్గంలోనే ప్రయాణిస్తానన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ పరిశీలనలో ఉందన్నారు.
గవర్నర్ తమిళ సై చేసిన ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లల తనతో వ్యవహారించిన తీరు నేపధ్యంలో చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు ఇటీవల కొంత సయోధ్య కుదిరిందని భావిస్తున్న తరుణంలో గవర్నర్ తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్ధేశం ఏమై ఉంటుందోనన్న చర్చలు సాగుతున్నాయి.
నాలుగేళ్ల వైరానికి తెరవేస్తూ గవర్నర్‌ను తాజాగా సీఎం కేసీఆర్ సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ఆమెకు రెడ్ కార్పెడ్ స్వాగతం పలికారు. అటు కేంద్రంలోని బీజేపీతోనూ కేసీఆర్ తెరవెనుక మిత్రత్వాన్ని సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో గవర్నర్, కేసీఆర్ మధ్య స్నేహ బంధం బలపడుతుందన్న ఆలోచనలకు భిన్నంగా గవర్నర్ గతాన్ని స్మరిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అటు ఇప్పటికే గవర్నర్ శాసన సభ ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును న్యాయపరిశీలనకు పంపారు.
కాగా.. వాటితో పాటు గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదన ఫైల్‌తో సహా 12బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతుంది. మరోవైపు జమిలి లేదా పార్లమెంటు ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఈ నేపధ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యల నేపధ్యంలో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మునుముందు చోటుచేసుకోబోయే పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.