Grain Purchase: రాష్ట్రంలో నేటి నుంచి.. ధాన్యం కొనుగోళ్లు
ఉన్నతాధికారులు, అన్నిజిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి విధాత: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని మంత్రులు సూచించారు. […]

- ఉన్నతాధికారులు, అన్నిజిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష
- ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి
విధాత: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని మంత్రులు సూచించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ కు సంబంధించి మిల్లర్ల నుంచి కస్టమ్ బియ్యాన్ని (సీమ్మాఆర్) ఈ నెల 30 లోగా సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇక నుంచి సీమ్మాఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించమని మంత్రులు హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి గోదాములను గుర్తించి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలి. ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు పేర్కొన్నారు.