Karimnagar: SI అభ్యర్థుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. హాజరు కానున్న 13,547 మంది అభ్యర్థులు

అభ్యర్థుల కోసం 18 పరీక్షా కేంద్రాలు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు విధాత బ్యూరో, కరీంనగర్‌: ఈనెల 8,9తేదీల్లో పాలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐ(సివిల్/ ఎఆర్/టిఎస్ఎస్పి/ఎస్ పిఎఫ్/ఎస్ఏ ఆర్ సిపియల్/ ఫైర్) అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయడు తెలిపారు. రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు. రాత పరీక్ష నేపధ్యంలో సోమవారం […]

Karimnagar: SI అభ్యర్థుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. హాజరు కానున్న 13,547 మంది అభ్యర్థులు
  • అభ్యర్థుల కోసం 18 పరీక్షా కేంద్రాలు
  • కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు

విధాత బ్యూరో, కరీంనగర్‌: ఈనెల 8,9తేదీల్లో పాలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐ(సివిల్/ ఎఆర్/టిఎస్ఎస్పి/ఎస్ పిఎఫ్/ఎస్ఏ ఆర్ సిపియల్/ ఫైర్) అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయడు తెలిపారు. రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు.

రాత పరీక్ష నేపధ్యంలో సోమవారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఛీఫ్ సూపరిండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, కిమ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల, శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ మరియు పిజీ కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ, పిజి కళాశాల, తిమ్మాపూర్ లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, నుస్తులాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 01 గంటవరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. రాతపరీక్షకు 13,547 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వివరించారు.

సమావేశంలో నోడల్ అధికారి జి.చంద్రమోహన్, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీలక్ష్మి, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, సి ప్రతాప్, ఎఐజి వెంకటేశ్వర్లు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఆబ్జర్వర్లు పాల్గొన్నారు.