TSPSC | నాలుగైదు రోజుల్లో గ్రూప్-4 హాల్ టికెట్లు జారీ..!

TSPSC | రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జులై 1వ తేదీన గ్రూప్-4 రాత ప‌రీక్ష నిర్వ‌హించేందుకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. మ‌రో నాలుగైదు రోజుల్లో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన అభ్య‌ర్థుల హాల్ టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల‌కు 9.51 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చ‌రిత్ర‌లో ఈ స్థాయిలో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌డం […]

TSPSC | నాలుగైదు రోజుల్లో గ్రూప్-4 హాల్ టికెట్లు జారీ..!

TSPSC | రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జులై 1వ తేదీన గ్రూప్-4 రాత ప‌రీక్ష నిర్వ‌హించేందుకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. మ‌రో నాలుగైదు రోజుల్లో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన అభ్య‌ర్థుల హాల్ టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది.

8,180 గ్రూప్-4 ఉద్యోగాల‌కు 9.51 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చ‌రిత్ర‌లో ఈ స్థాయిలో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌డం ఇది రెండో సంద‌ర్భం. 2018లో 700 వీఆర్‌వో ఉద్యోగాల‌కు 10.58 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 7.9 ల‌క్ష‌ల మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

ఇక గ్రూప్-4 ప‌రీక్ష పేప‌ర్-1ను ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్-2ను మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఒక్కో పేప‌ర్‌లో 150 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక్కో మార్కు కేటాయించ‌నున్నారు.