రైలులో ఏలియ‌న్స్ వీరంగం.. ఇద్ద‌ర‌మ్మాయిల‌పై దాడి.. వీడియో

విధాత: అది స‌బ్‌వే రైలు.. వేగంగా క‌దులుతోంది.. ఓ ఆరుగురు మ‌హిళ‌లు ఆకుప‌చ్చ దుస్తులు ధ‌రించారు. వారు చూడ్డానికి ఏలియ‌న్స్ మాదిరిగా క‌నిపిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్ద‌రు అమ్మాయిల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న్యూయార్క్‌లోని స‌బ్‌వే రైల్లో ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను రెడ్డిట్ షేర్ చేసింది. ఆరుగురు మ‌హిళ‌లు శ‌రీరం ఏ మాత్రం క‌నిపించ‌కుండా […]

రైలులో ఏలియ‌న్స్ వీరంగం.. ఇద్ద‌ర‌మ్మాయిల‌పై దాడి.. వీడియో

విధాత: అది స‌బ్‌వే రైలు.. వేగంగా క‌దులుతోంది.. ఓ ఆరుగురు మ‌హిళ‌లు ఆకుప‌చ్చ దుస్తులు ధ‌రించారు. వారు చూడ్డానికి ఏలియ‌న్స్ మాదిరిగా క‌నిపిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్ద‌రు అమ్మాయిల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న్యూయార్క్‌లోని స‌బ్‌వే రైల్లో ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను రెడ్డిట్ షేర్ చేసింది. ఆరుగురు మ‌హిళ‌లు శ‌రీరం ఏ మాత్రం క‌నిపించ‌కుండా ఆకుప‌చ్చ రంగు దుస్తుల‌ను ధ‌రించారు. ఉన్న‌ట్టుండి ఇద్ద‌రు అమ్మాయిల‌పై విరుచుకుప‌డ్డారు. వారిపై పంచుల వ‌ర్షం కురిపించారు. కింద ప‌డేసి కొట్టారు. అమ్మాయిల వ‌ద్ద ఉన్న సెల్‌ఫోన్లు, క్రెడిట్ కార్డ్స్, వాలెట్స్‌తో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను దొంగిలించార‌ని రెడ్డిట్‌లో పేర్కొన్నారు.

అయితే ఓ బాధితురాలి త‌ల్లి మాట్లాడుతూ.. ఏలియ‌న్స్ మాదిరిగా క‌నిపించిన ఆరుగురు మ‌హిళ‌లు త‌మ బిడ్డ‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశార‌ని వాపోయింది. తీవ్ర గాయాల‌పాలైంద‌ని, ఎక్స్ రే తో పాటు ఇత‌ర స్కాన్లు తీయించామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతానికి క‌ద‌ల్లేక పోతుంద‌ని, శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని త‌ల్లి పేర్కొంది. ఈ ఆరుగురు మ‌హిళ‌ల ప‌ట్ల న్యూయార్క్ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆమె సూచించింది.