Hanumantha Rao | గిరిజన మహిళకు కాంగ్రెస్ సహాయం: వీహెచ్‌

Hanumantha Rao | విధాత: పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధిత గిరిజన మహిళా లక్ష్మిభాయి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఐదు లక్షల సహాయం అందించనున్నట్లుగా పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన లక్ష్మిభాయిని పరామర్శించారు. ఈ నెల 30 న లక్ష్మి భాయి కూతురు వివాహం జరుగుతుందని, వారం రోజుల లోగా రూ.5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందించి పేదింటి పెళ్లికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. స్థానిక నాయకుడు చల్లా […]

Hanumantha Rao | గిరిజన మహిళకు కాంగ్రెస్ సహాయం: వీహెచ్‌

Hanumantha Rao | విధాత: పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధిత గిరిజన మహిళా లక్ష్మిభాయి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఐదు లక్షల సహాయం అందించనున్నట్లుగా పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన లక్ష్మిభాయిని పరామర్శించారు.

ఈ నెల 30 న లక్ష్మి భాయి కూతురు వివాహం జరుగుతుందని, వారం రోజుల లోగా రూ.5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందించి పేదింటి పెళ్లికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. స్థానిక నాయకుడు చల్లా లక్ష్మారెడ్డి లక్ష రూపాయలతో పాటు మరికొంత మంది దాతల ప్రోత్సాహంతో ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున సబితా ఇంద్రారెడ్డిని సహాయం చెయ్యాలని కోరడం జరిగిందన్నారు. అందుకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 3లక్షలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్నారని విహెచ్ చెప్పారు. లక్ష్మీబాయి ఇద్దరు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యనందించాలని మంత్రికి మరొక లేఖ రాస్తామన్నారు. పేదింటి పెళ్లికి అన్ని పార్టీలు ముందుకు వచ్చి లక్ష్మీబాయి కుటుంబానికి సహాయం చేయాలన్నారు.