Hawk And Snake | చేతిని చుట్టుకున్న పాము, పాము కోసం వచ్చిన డేగ.. తర్వాత ఏమైందంటే..?
Hawk And Snake | ఎప్పుడూ వినని, కనని.. కలలో కూడా ఊహించని దిగ్భ్రాంతికర ఘటన ఇది. ఒకే సారి పాము (Snake), డేగ (Hawk) దాడి చేసి తీవ్ర వ్యధకు గురిచేయడంతో ఓ మహిళ ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ ఘటన అమెరికా (America) టెక్సాస్‌లోని సిల్స్‌బీ గ్రామీణ ప్రాంతానికి చెందిన పెగ్గీ జోన్స్.. ఎప్పటిలానే తన ఇంటి పెరట్లో పని […]

Hawk And Snake |
ఎప్పుడూ వినని, కనని.. కలలో కూడా ఊహించని దిగ్భ్రాంతికర ఘటన ఇది. ఒకే సారి పాము (Snake), డేగ (Hawk) దాడి చేసి తీవ్ర వ్యధకు గురిచేయడంతో ఓ మహిళ ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
ఈ ఘటన అమెరికా (America) టెక్సాస్‌లోని సిల్స్‌బీ గ్రామీణ ప్రాంతానికి చెందిన పెగ్గీ జోన్స్.. ఎప్పటిలానే తన ఇంటి పెరట్లో పని చేసుకునేందుకు బయటకు వచ్చారు. అలా పనిచేసుకుంటూ ఉండగా.. ఒక పామును వేటాడి కాళ్లతో పట్టుకుని ఎగురుతూ వెళ్తున్న డేగ కనపడింది. దానిని చూస్తూ ఉండగానే.. ఆ గద్ద పట్టుతప్పడంతో పాము వచ్చి పెగ్గీపై పడింది.
వెంటనే అప్రమత్తమైన పెగ్గీ దానిని వదిలించుకుందామని చూస్తుండగా. అది తన చేతిని గట్టిగా చుట్టేసుకుంది. ఎంతలా పెనుగులాడినా అది తన చేతిని వదలలేదు. పైగా చేతికి చుట్టుకునే ఉండి పడగ విప్పి పెగ్గీ మొహంపై పలు సార్లు కాట్లు వేసింది.
చేతిని చుట్టుకున్న పాము, పాము కోసం వచ్చిన డేగ.. తర్వాత ఏమైందంటే..? https://t.co/kMPahmyIxF #viral #HAWK #SNAKE pic.twitter.com/FAHzEkS7Fh
— vidhaathanews (@vidhaathanews) August 9, 2023
ఈ పెనుగులాట జరుగుతుండగానే.. ఆ పామును పడేసుకున్న డేగ తన వేట కోసం వెనక్కి వచ్చింది. పెగ్గీ చేతికున్న పామును గుర్తించి దానిని తీసుకుపోదామని అది కూడా పెగ్గీ చేతిపై వాలింది. పాము అప్పటికే గట్టిగా చుట్టుకుని ఉండటంతో ముక్కుతో దాన్ని పొడుస్తూ నోట కరుచుకుపోదామని ప్రయత్నించింది.
ఈ పోరాటంలో అది పెగ్గీ మోచేతి కండను మొత్తం కొరికేసింది. చేయి విడవని పాము.. పాముని విడవని డేగ పోరాటంలో ఆమె చేయి మొత్తం తీవ్రంగా గాయపడింది. ఆఖరికి డేగకు పాము చిక్కడంతో అది వెళ్లిపోయి కథ సుఖాంతమైంది. స్పృహ కోల్పోయి పడిపోయిన పెగ్గీని ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించిన వైద్యులు ఆమె ప్రాణాలకు ముప్పు లేదని తెలిపారు.
డేగలు పాములను కాళ్లతో పట్టుకుని తీసుకెళ్లడం ఇక్కడ సర్వ సాధారణమే కాబట్టి పెద్ద పట్టించు కోలేదని పిగ్గీ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సారి అవి కనపడగానే జాగ్రత్త పడాలని తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. ఆ సన్నివేశాలను తలుచుకుంటేనే భయంగా ఉంటోందని.. రాత్రుళ్లు హఠాత్తుగా మెలకువ వస్తోందని వాపోయారు. జులై 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Texas woman survives attacks from snake, hawk after snake ‘fell from the sky’ https://t.co/3fP2hwy1PV pic.twitter.com/7xeY6eguBm
— FOX26Houston (@FOX26Houston) August 9, 2023