Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్: తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ దుండె. మల్లయ్య (50) కాకతీయ కాలువలో పడి మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ భగత్ నగర్‌లో నివాసం ఉంటూ హెడ్‌కానిస్టేబుల్‌గా పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు.
గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద గన్ మెన్ గా పనిచేశాడు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి గల కారణాలు తెలియరాలేదు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ పోలీసులు తెలిపారు.