Mulugu : ములుగులో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం
ములుగులో గిరిజన రైతులు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి కలెక్టర్ కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నరసింహమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన.

వరంగల్ ప్రతినిధి, విధాత: ఇటీవల హైద్రాబాద్ లో ప్రగతి భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జిల్లా కలెక్టర్ పై వెంకటాపురం బీ ఆర్ ఎస్ నాయకుడు గొడవర్తి నరసింహమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
పంట నష్టపోయిన గిరిజన రైతులకు నష్ట పరిహారం ఇప్పించినందుకు జిల్లా కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని బేషరతుగా కలెక్టర్ కు క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీలోని నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి రైతులకు న్యాయం చేసిన కలెక్టర్ ను బెదిరించిన నరసింహమూర్తి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.