Sekhar Master | రాకేశ్ మాస్టర్ మాటలు విని.. డ్యాన్స్ షో లో భోరు భోరున ఏడ్చేసిన శేఖర్ మాస్టర్

Sekhar Master విధాత‌: ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకి కొరియోగ్రాఫర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శేఖర్ మాస్టర్. అంతలా పాపులర్ అయిన శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్‌గానే కాకుండా, పలు ఛానళ్లలో షోస్‌కి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని సిరీస్‌లుగా ఢీ డాన్స్ షోకి జడ్జిగా ఉంటూ.. కంటెస్టెంట్స్‌కి పలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఇలా జడ్జిగా వ్యవహరిస్తూనే.. మూవీస్‌ పరంగానూ చిరంజీవి, బాలయ్య, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు […]

  • Publish Date - July 7, 2023 / 04:25 AM IST

Sekhar Master

విధాత‌: ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకి కొరియోగ్రాఫర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శేఖర్ మాస్టర్. అంతలా పాపులర్ అయిన శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్‌గానే కాకుండా, పలు ఛానళ్లలో షోస్‌కి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని సిరీస్‌లుగా ఢీ డాన్స్ షోకి జడ్జిగా ఉంటూ.. కంటెస్టెంట్స్‌కి పలు సూచనలు ఇస్తూ వస్తున్నారు.

ఇలా జడ్జిగా వ్యవహరిస్తూనే.. మూవీస్‌ పరంగానూ చిరంజీవి, బాలయ్య, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌కి కొరియోగ్రఫీ చేస్తూ సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. అటువంటి శేఖర్ మాస్టర్ గురించి రాకేశ్ మాస్టర్ ఆ మధ్య కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. శేఖర్ మోసగాడు, నన్ను మోసం చేశాడంటూ చెప్పిన మాటలకూ శేఖర్ మాస్టర్ ఎంతగానో బాధ పడ్డారు కానీ.. తిరిగి గురువుని ఒక్క మాట కూడా అనలేదు.

ఈ మధ్యే రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో మరణించారు. అప్పుడు ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్.. మరికొందరు డ్యాన్స్ మాస్టర్స్ కలిసి రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు చేయడమే కాకుండా, పెద్ద కర్మ కూడా జరిపించారు. ఆ సమయంలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము గురు శిష్యులమే కాదు.. మా ఇద్దరిది తండ్రి కొడుకుల బంధం.

మా మధ్య ఏవో చిన్న చిన్న అపార్ధాలు తప్ప.. థంబ్ లైన్లు పెట్టి ట్రోల్స్ చేసేంతగా పెద్ద గొడవలేమి లేవంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా మరోసారి ఆయన రాకేశ్ మాస్టర్‌ని తలుచుకుని కుమిలిపోయారు. ఆయన జడ్జ్‌గా ఉన్న ఢీ డాన్స్ షోలో గురువు రాకేశ్ మాస్టర్‌ని తలచుకొని భోరుభోరున ఏడ్చేశారు. ఎందుకంటే.. ఆ షోలో రాకేశ్ మాస్టర్‌కి సంబంధించిన ఒక వీడియోని ప్లే చేయగా.. అది చూసిన శేఖర్ మాస్టర్‌కి కన్నీళ్లు ఆగలేదు.

ఆ వీడియోలో ఏముందంటే.. ఇదే డాన్స్ షోలో అప్పట్లో రాకేశ్ మాస్టర్ మాట్లాడుతూ.. నాకు ఇంకా పెళ్లి కాకపోయినా నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడే శేఖర్ అని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన శేఖర్ మాస్టర్‌కి దు:ఖం ఆగలేదు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. నాకు తెలిసినంత వరకు మా గురువుకి తాగుడు అలవాటు లేదు. ఎవరో కావాలనే ఆయనకి ఆ వ్యసనాన్ని అలవాటు చేశారు.

మా మధ్య ఉన్న మనస్పర్దల్ని ఆసరాగా తీసుకుని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. నేను మోసగాడిని అని, మోసం చేశానని రాస్తున్నారని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడున్న వారిలో కళ్లలో కూడా నీళ్లు వచ్చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో బిట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Latest News