Heath Streak | నేను చ‌నిపోలేదు.. బ్ర‌తికే ఉన్నా! మ‌ర‌ణ వార్త‌ల‌పై స్పందించిన లెజెండ‌రీ క్రికెట‌ర్

Heath Streak ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. లేనిపోని రోగాల‌ని అంట‌గ‌ట్టి వారిని చంపేస్తూ అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నారు. తాజాగా జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారాలు చేశారు. 49 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న స్ట్రీక్… కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతుడ‌గా, మంగళవారం (ఆగస్ట్ 22) రాత్రి తుదిశ్వాస విడిచిన‌ట్టు పుకార్లు పుట్టించారు. అయితే హీత్ స్ట్రీక్ మ‌ర‌ణించాడని ఆయ‌న తోటి […]

  • By: sn    latest    Aug 23, 2023 10:31 AM IST
Heath Streak | నేను చ‌నిపోలేదు.. బ్ర‌తికే ఉన్నా! మ‌ర‌ణ వార్త‌ల‌పై స్పందించిన లెజెండ‌రీ క్రికెట‌ర్

Heath Streak

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. లేనిపోని రోగాల‌ని అంట‌గ‌ట్టి వారిని చంపేస్తూ అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నారు. తాజాగా జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారాలు చేశారు. 49 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న స్ట్రీక్… కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతుడ‌గా, మంగళవారం (ఆగస్ట్ 22) రాత్రి తుదిశ్వాస విడిచిన‌ట్టు పుకార్లు పుట్టించారు.

అయితే హీత్ స్ట్రీక్ మ‌ర‌ణించాడని ఆయ‌న తోటి క్రికెటర్ ముందుగా త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు. కొద్ది సేప‌టికి ఆయ‌న బ్ర‌తికే ఉన్నట్టు త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు ఒలంగా. థ‌ర్డ్ అంపైర్ అతడ‌ని వెన‌క్కి పిలిచాడంటూ పేర్కొన్నాడు. అయితే అస‌లు విష‌యం తెలుసుకోకుండా అలా త‌ప్పుడు ట్వీట్స్ ఎలా చేస్తావంటూ ఒలంగాని నెటిజ‌న్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.


ఒలంగా త‌ను స్ట్రీక్‌తో మాట్లాడానని, ఆయ‌న‌తో చేసిన చాట్ స్క్రీన్ షాట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చాట్‌లో తన మరణవార్తపై స్పందించిన స్ట్రీక్.. నేను బాగానే ఉన్నా. ఈ రనౌట్‌ను వెంటనే వెనక్కు తీసుకో బడ్డీ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. అయితే ఈ వార్త‌కు చాలా వేగంగా కాళ్లు వ‌చ్చాయి.

నువ్వు ఓవర్‌నైట్‌లో చచ్చిపోయావ్ బ్రదర్’ అంటూ ఒలంగా జోక్ చేయ‌గా, ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జింబాబ్వే తరఫున 1990ల్లో స్టార్ ప్లేయర్స్ లో ఒకడిగా ఎదిగిన‌ స్ట్రీక్. 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు.. టెస్టుల్లో 216 వికెట్లు తీయడంతో పాటు 1990 రన్స్ చేసిన హీత్ స్ట్రీక్.. వన్డేల్లో 239 వికెట్లు తీసి 2943 రన్స్ చేసి ఆ దేశానికి ఎన్నో విజ‌యాల‌ని అందించాడు.

జింబాబ్వే తరఫున ఆడిన అత్యుత్తమ క్రికెటర్లలో స్ట్రీక్ ఒక‌డు కాగా, 2021లో అతనిపై ఐసీసీ నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. స్ట్రీక్ ఐసీసీ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్నకార‌ణంగా ఆయ‌న‌పై నిషేదం విధించారు.

ఆ త‌ర్వాత హీత్ స్ట్రీక్ జింబాబ్వేతోపాటు బంగ్లాదేశ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు అతడు కోచ్ గానూ వ్యవహరించి ఆయా జ‌ట్లు విజ‌యం సాధించే విష‌యంలో కృషి చేశాడు. 2005లో చివరగా భారత్‌తో టెస్టు మ్యాచు ఆడి అనంత‌రం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు హీత్ స్ట్రీక్.