రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్

నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మాడుగుల పల్లి వద్ధ జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది

రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్

విదాత : నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మాడుగుల పల్లి వద్ధ జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.


కాగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.. లారీ బైక్ను ఢీ కొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు అతనిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.