High Court | జిల్లా జడ్జి పరీక్షల‌కు ఏపీ ల‌భ్య‌ర్థుల‌ను అనుమతించండి: హైకోర్టు

High Court రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారీ హైద‌రాబాద్‌, విధాత: జిల్లా జడ్జి పరీక్షలకు ఏపీకి చెందిన పిటీషనర్లను కూడా అనుమతించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫలితాల వెల్లడి, నియామకం మాత్రం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ నెల నిర్వహించనున్న జిల్లా జడ్జి పరీక్షల‌ను రాసేందుకు ఏపీకి చెందినవారిని అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10వ తేదీన జీవో నెంబర్ 36 ను […]

  • Publish Date - July 19, 2023 / 02:37 PM IST

High Court

  • రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారీ

హైద‌రాబాద్‌, విధాత: జిల్లా జడ్జి పరీక్షలకు ఏపీకి చెందిన పిటీషనర్లను కూడా అనుమతించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫలితాల వెల్లడి, నియామకం మాత్రం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

తెలంగాణలో ఈ నెల నిర్వహించనున్న జిల్లా జడ్జి పరీక్షల‌ను రాసేందుకు ఏపీకి చెందినవారిని అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10వ తేదీన జీవో నెంబర్ 36 ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన 38 మంది అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం బుధ‌వారం విచారణ చేపట్టింది. జిల్లా జడ్జి పరీక్షలు రాసేందుకు ఏపీకి చెందిన వారిని కూడా అనుమ‌తించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసింది.