AP High Court | ఏపీలో ఇక ధర్నాలకు బే ఫికర్.. జీఓ-1 కొట్టేసిన హైకోర్టు

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఇక ధైర్యముగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయవచ్చు. కోర్టులు, పోలీసు కేసులు ఉండవు. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. నడి రోడ్డు మీద నిర్ద్వంద్వంగా ప్రభుత్వ తీరును ఎండగట్టొచ్చు. రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు రోడ్ షోలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడానినీ నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు (AP High Court)  కొట్టేసింది. ఆ జీఓ ప్రజల ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యాన్ని […]

  • Publish Date - May 12, 2023 / 10:03 AM IST

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఇక ధైర్యముగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయవచ్చు. కోర్టులు, పోలీసు కేసులు ఉండవు. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. నడి రోడ్డు మీద నిర్ద్వంద్వంగా ప్రభుత్వ తీరును ఎండగట్టొచ్చు. రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు రోడ్ షోలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడానినీ నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. ఆ జీఓ ప్రజల ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించెలా ఉందని కోర్ట్ అభిప్రాయపడింది.

వాస్తవానికి చంద్రబాబు గతంలో ఒంగోలు జిల్లా కందుకూరు, ఇంకా గుంటూరుల్లో నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ప్రచార యావతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజలు ప్రాణాలు తీశారని అప్పట్లో వైసిపి టిడిపి మీద విరుచుకు పడింది.

Aphighcourt

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రోడ్లు , జనసమ్మర్థ ప్రాంతాల్లో సభలు సమావేశాలను నిషేధిస్తూ జీవో నంబర్ 1ని తెచ్చింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. తమ సభలకొస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక జగన్ ప్రభుత్వం ఈ చీకటి జీవోను తెచ్చిందని మండిపడ్డాయి. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ కొల్లు రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో గతంలో ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు జీవో నంబర్ 1పై స్టే ఇచ్చి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఈ జీవోను అప్పట్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ స్వాగతించారు. రోడ్లమీద ధర్నాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరు కో రాదని, ఈ జీఓ – 1 ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.

Latest News