111 GO | మంత్రుల ఫాంహౌస్‌లు మునగకుండా ఉండేందుకే.. హిమాయత్ సాగర్ గేట్లు తెరిచారు
111 GO | 111 జీవో పరిధిలో.. 80శాతం భూములు రియల్టర్ల చేతిలో. ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రుల ఫామ్ హౌజ్‌లు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షులు కోదండరెడ్డి విధాత: 111జీవో పరిధిలో 80 శాతం భూములు రియల్టర్ల చేతిలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ జంట జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రుల ఫామ్ హౌజ్‌లు కట్టుకున్నారన్నారు. మంత్రి హరీష్ […]

111 GO |
- 111 జీవో పరిధిలో.. 80శాతం భూములు రియల్టర్ల చేతిలో.
- ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రుల ఫామ్ హౌజ్‌లు
- ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షులు కోదండరెడ్డి
విధాత: 111జీవో పరిధిలో 80 శాతం భూములు రియల్టర్ల చేతిలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ జంట జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రుల ఫామ్ హౌజ్‌లు కట్టుకున్నారన్నారు.
మంత్రి హరీష్ రావుతో పాటు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫౌంహౌస్ లు ఎఫ్ టీ ఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాల నిర్మాణం వెనక కారణం బీఆర్ఎస్ కు తెలియదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పర్యావరణంపై అవగాహన లేదన్నారు. అందుకే హిమాయత్ సాగర్ పూర్తిగా నిండముందుకే మంత్రుల ఫాంహౌస్ లు మునగకుండా ఉండేందుకు గేట్లు తెరిచారని కోదండరెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ అవగాహన రాహిత్యం వల్ల జంట జలాశయాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రియల్టర్ల కోసమే ఈ ప్రభుత్వం 111జీవో ఎత్తివేసిందన్నారు. 111జీవో పరిధిలో సామన్య ప్రజలకే అన్నీ కండీషన్స్ పెడుతున్నారని, పెద్ద వారు మాత్రం ఇష్టారీతిలో ఇండ్లను కడుతున్నారన్నారు.
111 జీవో ఎత్తివేయడంపై ఓ రిపోర్ట్ తయారు చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇచ్చామన్నారు. ఓఆర్ఆర్ లీజులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే, ఇప్పటి వరకు మంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని కోదండరెడ్డి ప్రశ్నించారు.