HoneyRose | లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన హనీరోజ్..చిరుతో జతకట్టనున్న బ్యూటీ

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చికున్నది హనీరోజ్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయ్యింది

  • Publish Date - January 29, 2024 / 07:32 AM IST

Honey Rose | నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చికున్నది హనీరోజ్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయ్యింది. అయినా, తెలుగులో మరే చిత్రంలోనూ నటిపించలేదు. అయినా, అభిమానులకు దగ్గరగానే ఉంటున్నది. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు మిలియన్ల వరకు ఫాలో వర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్స్‌ ఓపెన్సింగ్‌తో బిజీబిజీగా ఉంటున్నది. పాన్‌ ఇండియా చిత్రం ‘రాచెల్‌’లో నటిస్తున్నది. అలాగే ‘తేరి మేరి’ సినిమాలోనూ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నది.


మరో వైపు తెలుగు మరో చిత్రంలో కనిపించబోతున్నదని సమాచారం. ఈ సారి కూడా సీనియర్‌ హీరోయిన్‌తో జతకట్టబోతున్నదని తెలుస్తున్నది. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో డబుల్‌ రోల్‌ చేసి మెప్పించింది. తాజాగా మెగాస్టార్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందని టాక్‌. ప్రస్తుతం మెగాస్టార్‌ ‘విశ్వంభర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిత్రం షూటింగ్‌ సైతం మొదలైంది. విజువల్‌ వండర్‌గా సినిమా తెరకెక్కనున్నది. ఇప్పటివే ప్రీ లుక్ పోస్టర్స్ విడుదల కాగా.. మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా హనీ రోజ్‌ను తీసుకున్నారని టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది.


అయితే, దీనిపై మేకర్స్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. విశ్వంభర మూవీలో కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే, గతంలో ఆచార్య సినిమాలోనూ కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్‌ను సినిమా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.


కాజల్‌తో పాటు మరికొందరు హీరోయిన్లను తీసుకుంటారని ప్రచారం జరగ్గా.. ఇప్పటి వరకు మేకర్స్‌ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హీరోయిన్‌గా హనీ రోజ్‌ పేరు వినిపిస్తున్నది. సినిమాలో హీరోయిన్లు ఎందరు ? ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే సినిమాలో రాణా దగ్గుబాటి విలన్‌గా చేయబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్‌. ఇక సినిమా వచ్చేడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.