మేషం : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. గొప్ప వ్యక్తిని కూడా కలిసే అవకాశం ఉంది.
వృషభం : ఈ రాశివారికి చేసే పనుల్లో ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి.
మిథునం : ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాల్సిందే. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం : ఈ రాశివారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన కార్యాలు ఆలస్యంగా అమలవుతాయి.
సింహం : ఈ రాశివారు ఇవాళ చేపట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు వర్ధిల్లుతాయి.
కన్య : ఈ రాశి వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. మానసికాందోళన తొలగిపోతుంది. ఆకస్మిక భయం కూడా దూరమవుతుంది.
తుల : రుణ లాభం పొందే అవకాశం ఉంది. ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.
వృశ్చికం : సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా గడుపుతారు. వాయిదా పనులన్నీ పూర్తవుతాయి. వ్యవసాయ పరంగా లాభాలను పొందే అవకాశం ఉంది.
ధనుస్సు : ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మకరం : ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి.
కుంభం : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ, క్రీడారంగంలోనికి వారికి అద్భుతమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు.
మీనం : ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతుంటారు.