మేషం : అనారోగ్య బాధలు సంభవించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. విదేశయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
వృషభం : కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
మిథునం : ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడుతాయి.
కర్కాటకం : ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.
సింహం : గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు.
కన్య : స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.
తుల : ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరును. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.
వృశ్చికం : స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమించేందుకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి.
ధనుస్సు : మానసిక ఆనందాన్ని పొందడమే కాకుండా, కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా సమస్యలను ఎదుర్కొంటారు.
మకరం : స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చంచలం అధికమవుతుంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
కుంభం : ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి.
మీనం : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.