18-02-2023 శనివారం.. రాశి ఫలాలు.. ఈ రాశివారికి తొందరపాటు పనికిరాదు..!
మేషం : రాజకీయ నాయకుల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. బంధు,మిత్రుల కలయికలు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృషభం : ఉద్యోగ మూలకంగా అశాంతి కలుగవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లడం వలన అసౌకర్యంగా ఉంటుంది. తండ్రి వర్గం వారితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రయత్నకార్యములు ఆలస్యం కావొచ్చును. మిథునం : దాచుకున్న ధనం కొంత ఖర్చు అయ్యే అవకావశం ఉన్నది. తొందరపాటు పనికిరాదు. మనసులో తెలియని ఆందోళనలు కలిగే […]

మేషం : రాజకీయ నాయకుల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. బంధు,మిత్రుల కలయికలు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి.
వృషభం : ఉద్యోగ మూలకంగా అశాంతి కలుగవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లడం వలన అసౌకర్యంగా ఉంటుంది. తండ్రి వర్గం వారితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రయత్నకార్యములు ఆలస్యం కావొచ్చును.
మిథునం : దాచుకున్న ధనం కొంత ఖర్చు అయ్యే అవకావశం ఉన్నది. తొందరపాటు పనికిరాదు. మనసులో తెలియని ఆందోళనలు కలిగే అవకాశం ఉన్నది. భోజన నియమాలు పాటించండి. ధన వ్యయము కలుగవచ్చును.
కర్కాటకం : స్థిరాస్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సత్ప్రవర్తనతో గౌరవాన్ని పొందుతారు. బంధు మిత్రుల నుంచి రావాల్సిన ధనం చేతికందుతుంది. అనుకొని ప్రమాదాల నుంచి బయటపడుతారు.
సింహం : మనసును కదిలించే మాటలు వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనం సంతోషాన్నిస్తుంది. తగిన గౌరవాన్ని పొందుతారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ధన ప్రాప్తి సంతోషాన్ని కలిగిస్తుంది.
కన్య : కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. శత్రువులు మిత్రులవుతారు. క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. సమాజంలో గౌరవము పెరుగుతుంది. వైద్య రంగంలోని వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి.
తుల : ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి. ప్రయాణ మూలకంగా అశాంతి కలుగవచ్చును. వాహన మూలకంగా వ్యయం చేయాల్సి వస్తుంది. భయం వదలండి.. లేదంటే పనులు ముందుకు సాగవు.
వృశ్చికం : జీవిత భాగస్వాములతో కఠినంగా వ్యవహరించకండి. సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగవచ్చును. ఇతరులపై ఆధారపడటం తగ్గించండి. శుభం కలుగుతుంది.
ధనుస్సు : బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం లభించవచ్చును. నష్టపోయిన చోటనే తిరిగి లాభం పొందే అవకాశం ఉన్నది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలను వింటారు.
మకరం : మంచి వ్యక్తులను కలియటం వలన ఆనందాన్ని పొందుతారు. దానధర్మాది మంచి కార్యములను చేస్తారు. బహుమానములను పొందుతారు. భోజన సౌఖ్యం కలుగుతుంది.
కుంభం : ప్రయాణాల మూలకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. చేయాల్సిన పనులను వాయిదా వేస్తారు. బంధు, మిత్రుల విరోధములు బాధించవచ్చును. వివాహ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి.
మీనం : ధన ధన్య లాభములు కలుగవచ్చును. భూముల క్రయ విక్రయాలు వలన లాభం కలుగుతుంది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఇంట్లో శుభాలు కలుగవచ్చును.