21-02-2023 మంగళవారం.. మీ రాశి ఫలాలు.. ఈ రాశివారికి భాగస్వామితో విరోధం..!
మేషం : ఆకస్మికముగా ధనలాభము కలుగుతుంది. సంతాన మూలకంగా, ఆనందాన్ని అనుభవిస్తారు. చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. వృషభం : శ్రమతో విజయాన్ని సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరువేరుతుంది. క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తారు. భయం స్థానంలో ఆత్మస్థైర్యము కలుగుతుంది. భోజనం విషయంలో శ్రద్ధ వహించండి. మిథునం : ఉదర సంబంధమైన బాధలు కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో కలహముల మూలకం అశాంతి ఏర్పడవచ్చును. అవమానాలు ఎదురౌతాయి. సమస్యలను వాయిదా వేసే ప్రయత్నం […]

మేషం : ఆకస్మికముగా ధనలాభము కలుగుతుంది. సంతాన మూలకంగా, ఆనందాన్ని అనుభవిస్తారు. చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.
వృషభం : శ్రమతో విజయాన్ని సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరువేరుతుంది. క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తారు. భయం స్థానంలో ఆత్మస్థైర్యము కలుగుతుంది. భోజనం విషయంలో శ్రద్ధ వహించండి.
మిథునం : ఉదర సంబంధమైన బాధలు కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో కలహముల మూలకం అశాంతి ఏర్పడవచ్చును. అవమానాలు ఎదురౌతాయి. సమస్యలను వాయిదా వేసే ప్రయత్నం చేయండి.
కర్కాటకం : వాత సంబంధమైన బాధలు కలుగవచ్చును. రుణ మూలక అశాంతి ఏర్పడవచ్చును. సమాజాన్ని ఎదిరించవలసి వస్తుంది. భయాన్ని వదలండి. పెద్దల సలహా ప్రకారం నడచుకోండి, ఆపదలు తొలగుతాయి.
సింహం : మనోధైర్యముతో సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన ఆదాయము కొంతవరకే చేతికందుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. క్రీడాకారులకు శ్రమ ఎక్కువ. సంతాన సహకారం లాభిస్తుంది.
కన్యా : దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. పరోపకారము వలన మానసిక ఆనందం కలుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం కలుగుతుంది.
తులా : పుణ్యక్షేత్ర దర్శనం లభిస్తుంది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భాగస్వాములతో విరోధమేర్పడవచ్చును. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయండి.
వృశ్చికం : ప్రభుత్వ అనుమతుల కొరకు ఎదురుచూసేవారు తొందర పడకండి. కార్యవిఘ్నములు కలుగవచ్చును. వాహనమూలక అసౌకర్యము కలుగవచ్చును. అపవాదులు తొలగిపోతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది.
ధనుస్సు : క్రయ విక్రయముల మూలకంగా లాభం కలుగుతుంది. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారస్థులకు ఇబ్బందులు తొలగిపోతాయి. గౌరవం లభిస్తుంది.
మకరం : అనుకోని సంఘటనలు బాధిస్తాయి. వృథా సంచారం మూలకంగా శరీర బాధలు కలుగవచ్చును. ధన వ్యయము పెరుగుతుంది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు కలుగుతాయి.
కుంభం : మీ ప్రజ్ఞా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యసాధన కలుగుతుంది. పెద్దల ఆదరణతో ఉల్లాసం లభిస్తుంది. వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. మొండితనం ప్రదర్శించకండి.
మీనం : సామాజిక భాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. మాటకారితనం వలన కార్యలాభము కలుగుతుంది. సత్ప్రవర్తన కలిగి వుంటారు. తొందరపాటు పనికిరాదు.
తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332