Horoscope | సోమ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశివారికి ధ‌న‌లాభం..!

మేషరాశి : (అశ్వని, భర‌ణి, కృత్తిక 1) : ప్రయాణములు చేయుదురు. కార్యభంగములు కలుగవచ్చును, ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయవలసి రావచ్చును. మనస్సులో పలుపలు విధములైన ఆలోచనలు కలుగుతాయి. వృషభ రాశి : (కృత్తిక -2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఆత్మస్థైర్యము కలిగి వుంటారు. దూర ప్రాంతముల నుండి శుభవార్త‌లు రావచ్చును. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఆహ్లాదకరమైన చర్చలు జరుపుతారు. ధనలాభము కలుగుతుంది. మిధున రాశి : (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు […]

Horoscope | సోమ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశివారికి ధ‌న‌లాభం..!

మేషరాశి : (అశ్వని, భర‌ణి, కృత్తిక 1) : ప్రయాణములు చేయుదురు. కార్యభంగములు కలుగవచ్చును, ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయవలసి రావచ్చును. మనస్సులో పలుపలు విధములైన ఆలోచనలు కలుగుతాయి.

వృషభ రాశి : (కృత్తిక -2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఆత్మస్థైర్యము కలిగి వుంటారు. దూర ప్రాంతముల నుండి శుభవార్త‌లు రావచ్చును. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఆహ్లాదకరమైన చర్చలు జరుపుతారు. ధనలాభము కలుగుతుంది.

మిధున రాశి : (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : తల్లిదండ్రులతో వాగ్వాదము కలుగవచ్చును. శరీరంలో వేడి మూలకంగా అసౌకర్య‌ము ఏర్పడవచ్చును. ధనవ్యయము, భోజన- – సౌఖ్యము లేకుండుట, వస్తు నష్టములు కలుగవచ్చును.

కర్కాటక రాశి : (పున‌ర్వ‌సు 4, పుష్య‌మి ఆశ్రేష) : దైవకార్యములు నిర్వహిస్తారు. నూతన కార్యములను ఆరంభించుటకై అనుకూలము. సంఘంలో గౌరవమును పొందుతారు. శరీరము ఉల్లాసముగా వుంటుంది. రోజంతా ఆనందముగా గడుపుతారు.

సింహ రాశి : (మఘ, పుబ్బ, ఉత్తర 1) : దూర ప్రయాణములు చేయవలసి రావచ్చును. ప్రభుత్వ ఉద్యోగులకు చిక్కులు కలుగవచ్చును. అవమానములు, ధనక్షయము కలుగవచ్చును. సోమరితనము వలన ఇబ్బందులకు గురయ్యెదరు.

కన్యా రాశి : (ఉత్తర 2, 3,4, హస్త, చిత్ర 1,2) : ఇంట్లో శుభములు కలుగుతాయి. మ‌న‌స్సు ఉల్లాసంగా వుంటుంది. సంతాన మూలకంగా సౌఖ్యము కలుగుతుంది. మనస్సు బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి మూలకంగా ధనలాభము ఉంటుంది.

తులా రాశి : (చిత్ర 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3) : శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులను క్షమిస్తారు. అనుకున్న పనులను సాధిస్తారు. కోపం, ఉద్వేగము ఎక్కువగా వుండవచ్చును.

వృశ్చికం రాశి : (విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ) : శరీరము వేడి చేయుట. అధికారుల వలన అశాంతి ఎక్కువ శ్రమించట. బంధుమిత్ర విరోధములు కలుగవచ్చును. వృధా సంచారము వుండును.

ధ‌న‌స్సు రాశి : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 ) : దేవాలయ సంబంధ వ్యవహారములో పాల్గొందురు. అజీర్ణము, తలనొప్పి వుండవచ్చును. ఇష్టములేని పనులను చేయుదురు. ఇతరుల వ్యవహారములో జోక్య‌ము చేసుకొందురు.

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) : రాజకీయ నాయకులకు అనుకూలమైన రోజు. కీర్తి లభించును. ప్రయాణములు అనుకులించును. జీవిత భాగస్వాములను సంతోష పెట్టుదురు, రావలసిన ధనము చేతి కందును.

కుంభ రాశి : ( ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3) : వివాహ ప్రయత్నములకు అనుకూలము. గాయకులకు కొత్త అవకాశములు దొరకును. శరీరములో అనారోగ్యము నుండి ఉపశమనము దొరకును. అక్క, చెల్లెండ్రు తో మనస్ఫుర్తిగా సంభాషింతురు.

మీన రాశి : (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోని విధంగా పనులు పూర్తిచేయుదురు. మీ సామర్ధ్యానికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలోచనలు చేయుదురు. భోజనము రుచింపదు, అపవాదులు తప్పక పోవచ్చును.

తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : 99490 11332