మంగళవారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి అపనిందలు తప్పవు..!
మేష రాశి : క్రీడాకారులకు ఎక్కువగా శ్రమింతురు. ఇష్టమైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. సోమరితనము ఉంటుంది. కార్యయత్నములు అనుకూలించవు. వృషభ రాశి : కలహముల మూలకంగా చిక్కులు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. యత్నకార్యములు మూలకంగా నిరాశ కలుగుతుంది. నేత్ర బాధలు కలుగవచ్చును. మిథున రాశి : పోలీసు శాఖలో పని చేయువారికి గుర్తింపు లభిస్తుంది. మానసిక ఆనందమును పొందుతారు. జీవితత భాగస్వాముల సహకారముతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారస్థులకు ధన లాభము […]

మేష రాశి : క్రీడాకారులకు ఎక్కువగా శ్రమింతురు. ఇష్టమైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. సోమరితనము ఉంటుంది. కార్యయత్నములు అనుకూలించవు.
వృషభ రాశి : కలహముల మూలకంగా చిక్కులు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. యత్నకార్యములు మూలకంగా నిరాశ కలుగుతుంది. నేత్ర బాధలు కలుగవచ్చును.
మిథున రాశి : పోలీసు శాఖలో పని చేయువారికి గుర్తింపు లభిస్తుంది. మానసిక ఆనందమును పొందుతారు. జీవితత భాగస్వాముల సహకారముతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారస్థులకు ధన లాభము కలుగుతుంది.
కర్కాటక రాశి : ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా వుంటుంది. సంతాన మూలక శుభవార్తలు వింటారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. కొన్ని అపనిందలు భరించవలసి వస్తుంది. ధనవ్యయము తప్పదు.
సింహ రాశి : కుటుంబ సభ్యుల వలన ఆనందాన్ని పొందుతారు. విలువైన వస్తువులను సంగ్రహిస్తారు. శరీరము ఉల్లాసంగా వుంటుంది. సమాజంలో గౌరవము లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు.
కన్య రాశి : విద్యార్ధులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఖర్చు ఎక్కువగా వుంటుంది. సోమరితనము వలన ఇబ్బందులు కలుగుతాయి. విదేశీయాన ప్రయత్నములు నెమ్మదిస్తాయి. అవమానమును ఎదుర్కొంటారు .
తులా రాశి : దైవదర్శనము, మంచివారితో కలిసి ఉల్లాసముగా గడిపెదరు, ఆకస్మిక ధనలాభము కలుగుతుంది. సంతానమునకు శుభములు కలుగుతాయి, భావోద్వేగానికి లోనయ్యెదరు.
వృశ్చిక రాశి : కోర్టు వ్యవహారములకు అనుకూలము. బంధుమిత్రుల సహకారము లభించును. శరీరము ఉల్లాసముగా వుండును. నూతన ప్రణాళికలు రచించెదరు. పరోపకారము చేయుదురు.
ధనుస్సు రాశి : కళాకారులకు అంత అనుకులముగా వుండదు. పై అధికారుల అసహనము బాధిస్తుంది. పనియందు ఆసక్తి కోల్పోవుదురు. సంతాన మూలకంగా ఆశాంతి కలుగవచ్చును.
మకర రాశి : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిళ్ళు వుంటాయి. అజీర్ణముచే శరీర సౌఖ్యము వుండకపోవచ్చును. ధనవ్యయము అధికంగా వుంటుంది. తలపెట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
కుంభ రాశి : జీవిత భాగస్వాముల సహకారముచే కార్యసాధన కలుగుతుంది. శౌర్యముచే ఉన్నతస్థానాన్ని పొందుతారు. స్థిరాస్థి వ్యవహారములకు అనుకూలమైన రోజు. ధనలాభము సంతోషాన్ని కలిగిస్తుంది..
మీన రాశి : కళాకారులు, గాయకులు కీర్తిని పొందుతారు. ఇంట్లోవారితో ఆసక్తికరమైన సంభాషణలు జరుపుతారు. బంధుమిత్రులకు చక్కని సలహాలనిస్తారు. వచ్చిన వస్తువులను పొందుతారు.