25-03-2023 శ‌నివారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి అవ‌మానాలు..!

మేష రాశి : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మోసపోయే ప్రమాదముల నుండి తప్పించుకొందురు. జీవిత భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలము. ఒకేసారి రెండు మూడు పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి : ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి అనుకూలము. ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దాన ధర్మాదులను ఆచరిస్తారు. రావలసిన ధనం కొంత చేతికందుతుంది. సంగీత కళాకారులకు సన్మానాది గౌరవములు లభిస్తాయి. మిథున రాశి : అనుకోని ఆపదలు […]

25-03-2023 శ‌నివారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి అవ‌మానాలు..!

మేష రాశి : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మోసపోయే ప్రమాదముల నుండి తప్పించుకొందురు. జీవిత భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలము. ఒకేసారి రెండు మూడు పనులను పూర్తి చేస్తారు.

వృషభ రాశి : ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి అనుకూలము. ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దాన ధర్మాదులను ఆచరిస్తారు. రావలసిన ధనం కొంత చేతికందుతుంది. సంగీత కళాకారులకు సన్మానాది గౌరవములు లభిస్తాయి.

మిథున రాశి : అనుకోని ఆపదలు ఇబ్బంది కలిగిస్తాయి. తీర్థయాత్రలలో దేహబాధలు కలుగు అవకాశం. ఇష్టమైన వస్తువులను పొందే ప్రయత్నాలు ఫలించవు. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. శ్రమ ఎక్కువవుతుంది.

కర్కాటక రాశి : కుటుంబంలో పెద్దలకు అనారోగ్యములుండవచ్చును. మీకు తెలియకుండానే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. బంధుమిత్రులు విరోధములు వలన కలుగుతుంది. అపవాదులను ఎదుర్కొంటారు.

సింహ రాశి : విద్యార్థులు ఆసక్తికరమైన చర్చలలో పాల్గొంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. బాల్య మిత్రులను కలుసుకుంటారు. నష్టపోయామనుకున్న ధనము కొంత తిరిగి లభిస్తుంది. ప్రయత్న కార్యములు అనుకూలిస్తాయి.

కన్యా రాశి : ధన వ్యయం అధికంగా ఉంటుంది. నిందా వాక్యములను వినవలసి వస్తుంది. వైద్యరంగంలో వారికి ప్రయత్న కార్యాలు తొందరగా పూర్తి చేస్తారు. శరీరము నందు జ్వరం మొదలైన అసౌకర్యములు ఉండవచ్చును. భోజన సౌఖ్యము ఉండదు.

తులా రాశి : దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. సత్యమును తెలుసుకోవడం వలన అపార్ధాలు తొలగిపోతాయి. మనోళ్లాసం కలిగి ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి : స్థిరత్వం లేక సంచారం చేస్తూ ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక సంఘటనలు బాధిస్తాయి. అవమానములు ఎదుర్కొనవలసి వస్తుంది. కోపం ఎక్కువ ప్రదర్శిస్తారు.

ధనస్సు రాశి : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పని పూర్తి చేసే ప్రయత్నంలో కీర్తిని పొందుతారు. కుటుంబ సుఖములకు ప్రాధాన్యతనిస్తారు. శత్రువులు మిత్రులు కావచ్చును. ధన లాభం ఉంటుంది.

మకర రాశి : చేయవలసిన పనులు ఎక్కువగా శాతం ఎక్కువ శాతం పూర్తిచేస్తారు. మీ మనోభీష్టాలు నెరవేరుతాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. ప్రముఖులతో కలయికల లాభిస్తాయి. వివాహ ప్రయత్నం నెరవేరు అవకాశం.

కుంభ రాశి : కుటుంబ సభ్యులపై అపవాదులు రావడం బాధిస్తుంది. శ్రమాధిక్యత వలన శరీర బాధలు ఉంటాయి. చేయవలసిన పనులను మధ్యలో వదిలేస్తారు. సమాన జనులతో విరోధములు కలగవచ్చును.

మీన రాశి : కరపాదములకు బాధలు కలగవచ్చును. ఒకచో వస్తువులను పోగొట్టుకొందురు. మనసులో అపరితమైన ఆలోచనలు కలుగుతుంటాయి. చేసిన ప్రయత్నంలో నిష్ఫలమౌతాయి. ధన వ్యయము అధికంగా ఉంటుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.