06-03-2023 సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి..!
మేష రాశి : విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భయం మూలకంగా మనసు చంచలము కలుగవచ్చును. శ్రమ ఎక్కువౌతుంది. అపవాదులు కలుగుతాయి. చోర, శస్త్ర బాధలు కలుగవచ్చును. వృషభ రాశి : ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభిస్తాయి. కవులు, పండితులు నూతన ఆవిష్కరణలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిథున రాశి : ఆత్మస్థైర్యముతో పనులు పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఆనందాన్నిస్తాయి. వాక్చాతుర్యమును ప్రదర్శిస్తారు. […]

మేష రాశి : విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భయం మూలకంగా మనసు చంచలము కలుగవచ్చును. శ్రమ ఎక్కువౌతుంది. అపవాదులు కలుగుతాయి. చోర, శస్త్ర బాధలు కలుగవచ్చును.
వృషభ రాశి : ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభిస్తాయి. కవులు, పండితులు నూతన ఆవిష్కరణలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
మిథున రాశి : ఆత్మస్థైర్యముతో పనులు పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఆనందాన్నిస్తాయి. వాక్చాతుర్యమును ప్రదర్శిస్తారు. ద్రవ్య లాభముంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
కర్కాటక రాశి : నిందా వాక్యములను వినవలసి వస్తుంది. అధికారుల మూలక భయమేర్పడుతుంది. దుర్వార్తా శ్రవణము కలుగవచ్చును. మనోవ్యాకులము ఏర్పడవచ్చును. బహుముఖ ధనవ్యయము వుండవచ్చును.
సింహ రాశి : గృహము నందు సౌఖ్యము లభిస్తుంది. దైవ చింతనతో మనశ్శాంతి లభిస్తుంది. అద్భుతమైన ప్రవచనములను వింటారు. భోజన సౌఖ్యము తృప్తినిస్తుంది. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి.
కన్యా రాశి : ప్రయాణములు ఉల్లాసాన్నిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకొని వ్యక్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది. దాన ధర్మాది శుభములనాచరిస్తారు.
తులా రాశి : ఇష్టమైన వ్యక్తుల ఆతిధ్యం ఆనందాన్నిస్తుంది. శుభకార్యములకు ధన వ్యయముంటుంది. వాహన మూలక అసౌకర్యం కలుగుతుంది. సంతాన మూలక అశాంతి కలుగవచ్చును.
వృశ్చిక రాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల మూలక సంతోషములు కలుగుతాయి. నూతన కార్యారంభమునకై సమాలోచనలు చేస్తారు. శ్రమ ఎక్కువైననూ కార్యసిద్ధి కలుగుతుంది.
ధనుస్సు రాశి : చేస్తున్న పనులను పూర్తి చేయడానికి శ్రమించాల్సి వస్తుంది. బంధుమిత్రుల విరోధములు కలుగవచ్బును. వృత్తి, ఉద్యోగాలలో అశాంతి కలుగవచ్చును. వృధా సంచారము చేయవలసి వస్తుంది.
మకర రాశి : ఉదర సంబంధమైన బాధలు కలుగవచ్చును. ఇతరుల బాధ్యతలను మీరు నిర్వహించవలసి వస్తుంది. వృత్తి యందు చిక్కులు ఏర్పడతాయి. ధన వ్యయము ఎక్కువగా ఉంటుంది.
కుంభ రాశి : పరోపకారముల వలన గౌరవమర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ కార్యనిర్వహణా దీక్షిత ప్రశంసలనందుకుంటుంది. ధన లాభము సంతోషాన్నిస్తుంది.
మీన రాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కొరికలు నెరవేరుతాయి. శరీర బలహీనతలు ఉపశమిస్తాయి. ప్రయత్న కార్యములలో అనుకలతలు ఆనందాన్నిస్తాయి. ధనాదాయం వుంటుంది.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.