Telangana – Maharashtra Border | వంట గది తెలంగాణలో.. పడక గది మహారాష్ట్రలో.. ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. ఎందుకంటే ఆ ఇల్లు రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉన్నది. మరి ఆ ఇంటి గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మహారాజగూడకు వెళ్లాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తమ్ పవార్ కుటుంబం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య గత కొన్నేండ్లుగా ఉంటుంది. అయితే అన్నదమ్ములు ఇల్లు పంచుకోవడంతో.. నాలుగు గదులు తెలంగాణ భూభాగంలోకి, మరో నాలుగు గదులు మహారాష్ట్ర భూ భాగంలోకి వెళ్లాయి. ఈ క్రమంలో వంట గది తెలంగాణ సరిహద్దులో, పడక గది, హాల్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. అయితే ఉత్తమ్‌కు వచ్చిన వంట గది తెలంగాణలో ఉండటం విశేషం.
ఈ సందర్భంగా ఉత్తమ్ పవార్ మాట్లాడుతూ.. మా కుటుంబంలో 13 మంది కలిసి ఉంటున్నారు. మా ఇల్లు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భాగమైనప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో 14 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ అటు తెలంగాణ, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి లబ్ది పొందుతున్నాయి. రెండు రాష్ట్రాలకు ట్యాక్సులు చెల్లిస్తున్నాం అని తెలిపాడు. అయితే అధికారులు ఇంటిపై సరిహద్దు గీత గీసి, తెలంగాణ, మహారాష్ట్ర అని రాశారు.
Maharashtra | A house in Maharajguda village, Chandrapur is spread b/w Maharashtra & Telangana – 4 rooms fall in Maha while 4 others in Telangana
Owner, Uttam Pawar says, “12-13 of us live here. My brother’s 4 rooms in Telangana&4 of mine in Maharashtra, my kitchen in Telangana” pic.twitter.com/vAOzvJ5bme
— ANI (@ANI) December 15, 2022