విధాత: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఐదుగురిలో ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ముగ్గురిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. లావలాంగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛత్రా – పాలమూ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం ఉదయం భద్రతా బలగాలు ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు.
బలగాల కదలికలను గ్రహించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా అదే స్థాయిలో మావోయిస్టులపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులతో పాటు భారీగా ముందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీం చేసుకున్నారు.
గౌతం పాసవాన్, చార్లిపై రూ. 25 లక్షల చొప్పున రివార్డు ఉంది. వీరిద్దరూ ఎస్ఏసీ మెంబర్స్. నందు, అమర్ గంజు, సంజీవ్ భూయాన్ సబ్ జోనల్ కమాండర్స్. వీరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఆ ఏరియాలో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.