వామ్మో.. ఈ భారీ ఆనకొండను చూస్తే వణుకు పుట్టాల్సిందే.. వీడియో వైరల్
విధాత : ఈ భారీ కొండ చిలువను చూస్తే శరీరంలో వణుకు పుట్టక తప్పదు. అదేదో ఐదారడుగులు లేదు. దాదాపు 20 అడుగుల పొడవు ఉంది. ఒక చెట్టుపైకి ఆ కొండచిలువ పాకుతున్న దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. ఈ కొండ చిలువను నెటిజన్లు అనకొండతో పోల్చుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హర్యానాలోని పంచకులలోని బీర్ గఘర్ విలేజ్‌లో ఈ కొండచిలువ ప్రత్యక్షమైనట్లు విజయ్ సింగ్ అనే నెటిజన్ […]

విధాత : ఈ భారీ కొండ చిలువను చూస్తే శరీరంలో వణుకు పుట్టక తప్పదు. అదేదో ఐదారడుగులు లేదు. దాదాపు 20 అడుగుల పొడవు ఉంది. ఒక చెట్టుపైకి ఆ కొండచిలువ పాకుతున్న దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. ఈ కొండ చిలువను నెటిజన్లు అనకొండతో పోల్చుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హర్యానాలోని పంచకులలోని బీర్ గఘర్ విలేజ్‌లో ఈ కొండచిలువ ప్రత్యక్షమైనట్లు విజయ్ సింగ్ అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ కొండచిలువను ఫారెస్టు అధికారులు గుర్తించినట్లు అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. 2018లో సౌతాఫ్రికాలోని అడవుల్లో ఈ కొండచిలువ ప్రత్యక్షమైనట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు.