Andhra Pradesh | తొలిరాత్రి దృశ్యాలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో వైరల్ చేసిన భర్త
Andhra Pradesh | తొలిరాత్రి( First Night ) నూతన దంపతులకు గుర్తుండి పోయే రోజు. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండేలా తనివితీరా ఎంజాయ్ చేసేందుకు ప్రతి నూతన జంట( New Couple ) ఆరాట పడుతుంది. అలాంటి మధుర క్షణాలను ఓ భర్త తన స్మార్ట్ ఫోన్( Smart Phone )లో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా తన శోభనం వీడియోలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ […]
Andhra Pradesh | తొలిరాత్రి( First Night ) నూతన దంపతులకు గుర్తుండి పోయే రోజు. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండేలా తనివితీరా ఎంజాయ్ చేసేందుకు ప్రతి నూతన జంట( New Couple ) ఆరాట పడుతుంది. అలాంటి మధుర క్షణాలను ఓ భర్త తన స్మార్ట్ ఫోన్( Smart Phone )లో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా తన శోభనం వీడియోలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండల పరిధిలోని ఓ తీర ప్రాంత గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తీర ప్రాంత గ్రామానికి చెందిన ఓ యువకుడి(20), అదే ప్రాంతానికి చెందిన బాలిక(17)తో ఫిబ్రవరి 8న వివాహం జరిగింది. ఇక తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను తన భార్యకు తెలియకుండా మొబైల్‌లో చిత్రీకరించాడు. తెల్లారేసరికి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక ఆ వీడియోలు వైరల్ కావడంతో నూతన వరుడు కటకటాలపాలయ్యాడు.
ఫిబ్రవరి 20న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, అతడిని 28న అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లి సిద్ధపడింది. కానీ అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న ఆ గ్రామ పెద్దలు ప్రయివేటు పంచాయితీ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించినట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram