Lucknow | క‌న్న‌బిడ్డ‌ల ముందే.. భార్య‌ను చంపిన భ‌ర్త‌

కారులోనే వ్యాపార‌వేత్త దారుణం.. యూపీలో ఘ‌ట‌న‌ భార్య‌కు ఇస్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్లు పెరుగ‌డంపై ఆగ్ర‌హం త‌న భార్య కోసం ఇంటికి వ‌స్తున్నార‌నే అనుమానం Lucknow | విధాత‌: క‌న్నబిడ్డ‌ల ఎదుటే భార్య‌ను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యాపార‌వేత్త. ఇస్టాగ్రామ్ (Instagram)లో త‌న భార్య‌కు ఫాలోవ‌ర్లు పెరుగ‌డం, తాను లేన‌ప్పుడు భార్య కోసం ఇంటికి వారు వ‌స్తున్నార‌నే అనుమానంతో ఆమె చంపేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ (Rae Bareli) జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న‌ది. ల‌క్నోకు చెందిన […]

  • Publish Date - August 15, 2023 / 06:01 AM IST

  • కారులోనే వ్యాపార‌వేత్త దారుణం.. యూపీలో ఘ‌ట‌న‌
  • భార్య‌కు ఇస్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్లు పెరుగ‌డంపై ఆగ్ర‌హం
  • త‌న భార్య కోసం ఇంటికి వ‌స్తున్నార‌నే అనుమానం

Lucknow | విధాత‌: క‌న్నబిడ్డ‌ల ఎదుటే భార్య‌ను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యాపార‌వేత్త. ఇస్టాగ్రామ్ (Instagram)లో త‌న భార్య‌కు ఫాలోవ‌ర్లు పెరుగ‌డం, తాను లేన‌ప్పుడు భార్య కోసం ఇంటికి వారు వ‌స్తున్నార‌నే అనుమానంతో ఆమె చంపేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ (Rae Bareli) జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న‌ది.

ల‌క్నోకు చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నిర్వ‌హించే వ్యాపార‌వేత్త (businessman) కు 15 ఏండ్ల క్రితం వివాహ‌మైంది. వారికి 12 కూతురు, 5 ఏండ్ల కొడుకు ఉన్నాడు. ఆయ‌న భార్య గృహిణి. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇటీవ‌ల ఆమె ఖాతా బ్లాక్ అయింది. విచార‌ణ జ‌రుప‌గా.. త‌న భ‌ర్త దానికి బ్లాక్ చేయించాడ‌ని తేలింది.

Latest News