MP Etala Rajender: ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే: ఎంపీ ఈటల
ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే: ఎంపీ ఈటల
విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే అని..నా కుటుంబ సభ్యుల, కారు డ్రైవర్ల, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం నుంచి మంగళవారం తనకు పిలుపు వచ్చిందని..తప్పకుండా నా దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులకు స్టేట్మెంట్ ఇస్తానని ఈటల తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధమని..ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలిపెట్టకూడదన్నారు. ఫోన్లను ట్యాప్ చేయడం రాజ్యాంగ విరుద్ధం, హక్కులకు విరుద్ధం, స్వేచ్ఛకు విరుద్ధం, చట్ట విరుద్ధమని..చేతిలో అధికారం ఉందని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు చేస్తారా..? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు శిక్షపడాల్సిందేనన్నారు. ట్యాపింగ్ కేసులో ఎవరూ తప్పించుకోలేరని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీజేపీ ఎంపీలు అర్వింద్ కుమార్, రఘునందన్ రావు, ఈటలలను సిట్ వాంగ్మూలం కోసం పిలిచింది. అయితే వారితో పాటు ఎంపీ కే.లక్ష్మణ్, నాయకులు ప్రేమేందర్ రెడ్డిల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా ఆరోపణలున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram