Bandla Ganesh: ఇక నుంచి పవన్‌కి దూరంగా ఉంటా.. బండ్ల సంచలన నిర్ణయం..!
Bandla Ganesh: టాలీవుడ్‌కి కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ప్రేక్షకులకి మంచి సినిమాలని అందించిన నిర్మాత బండ్ల గణేష్. ‘గబ్బర్ సింగ్’ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ ఆ సక్సెస్‌ని కొనసాగించలేక పోయాడు. ఆయన నిర్మాతగా కన్నా కూడా పవన్ వీర భక్తుడిగానే ఎక్కువగా చెబుతూ ఉంటారు. పవర్ స్టార్ గణేష్‌ల మధ్య ఉన్న గురుశిష్యుల బంధం, దేవుడు-భక్తుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్‌ని […]

Bandla Ganesh:
టాలీవుడ్‌కి కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి ప్రేక్షకులకి మంచి సినిమాలని అందించిన నిర్మాత బండ్ల గణేష్. ‘గబ్బర్ సింగ్’ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ ఆ సక్సెస్‌ని కొనసాగించలేక పోయాడు. ఆయన నిర్మాతగా కన్నా కూడా పవన్ వీర భక్తుడిగానే ఎక్కువగా చెబుతూ ఉంటారు. పవర్ స్టార్ గణేష్‌ల మధ్య ఉన్న గురుశిష్యుల బంధం, దేవుడు-భక్తుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్‌ని ‘దేవర’గా కొలుస్తుంటాడు బండ్ల. ఆయనని ఎవరైనా ఒక్క మాట అన్నా.. ఆయన గురించి ఎవరైనా పిచ్చరాతలు రాసినా.. వెంటనే కౌంటర్ వేస్తుంటాడు.
ఇక స్టేజ్‌పైన బండ్ల.. ఎదురుగా పవన్ కల్యాణ్ ఉంటే.. బండ్లను పట్టుకోవడం ఎవరితరం కాదు. ప్రవాహంలా పంచ్‌లు వస్తూనే ఉంటాయి. ఇది ఎన్నోసార్లు ప్రేక్షక జనం చూసి ఉన్నారు. ఇక ఇప్పుడు ‘ఉంటే మీకు సహాయంగా ఉంటా.. మీ పేరు చెప్పుకుని లబ్ధిపొందే ప్రయత్నాలు మాత్రం చేయను’ అంటూ బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
మాములుగా పవన్ కల్యాణ్ పై బండ్ల ట్వీట్ వేస్తేనే పిచ్చెక్కించే నెటిజన్లు.. ఇలా గురువు అంటూ లబ్ధి పొందనని, సహాయంగా ఉంటానని అనడంతో.. ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడు గురువు అంటూ పవన్ కల్యాణ్‌ని సంభోదించడంతో.. కొంతమంది ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాస్త క్లారిటీగా ట్వీట్ వేయవచ్చు కదన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం.. తన గురువుపై భక్తిని ‘గురు పౌర్ణమి’ సాక్షిగా బండ్ల బయటికి తీశాడంటూ.. మెగా ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అసలిదంతా బండ్ల ఇప్పుడెందుకు చెప్పాడంటే.. ఇందులో చిన్న తిరకాసు లేకపోలేదు.
కొన్నాళ్లుగా మాత్రం పవన్ వేడుకలకి బండ్ల గణేష్‌కి ఆహ్వానం అందడం లేదు. అందుకు కారణం త్రివిక్రమ్ అని ఓ టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకునేమో ఆ మధ్య గురూజీ అంటూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుస్తూ తన కోపాన్నంతా వెళ్లగక్కుతున్నారు. తన దేవరకి తనని దూరం చేస్తుంది ఆ గురువే అన్నట్లుగా కూడా ఇటీవల కొన్ని ట్వీట్స్ సైతం చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ వలనే బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌కి మధ్య దూరం పెరిగిందని టాక్. అయితే పవన్.. బండ్లని దూరం పెట్టినా గణేష్ మాత్రం ఆయనపై తన ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేసి వార్తలలోకి ఎక్కారు బండ్ల. గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి.. మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ, మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో తెలియజేశారు.
వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయగా, ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఆ మధ్య రాజకీయాలలోకి వెళ్లి చేతులు కాల్చుకున్న బండ్ల ఇప్పుడు తిరిగి రాజకీయాలలోకి వెళతాడనే టాక్ అయితే నడుస్తుంది.