Ladakh | తూర్పు లఢక్‌కు 68 వేల మంది సైనికులు
గల్వాన్ ఘర్షణ తర్వాత భారీగా మోహరింపు వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు 90 కంటే ఎక్కువ యుద్ధ ట్యాంకులు కూడా Ladakh | విధాత: మూడేండ్ల క్రితం గాల్వాన్ (Galvan) లోయలో చైనా- భారత్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇప్పటివరకు 68,000 మందికిపైగా సైనికులను తూర్పు లడఖ్‌కు భారత వైమానిక దళం తరలించింది. 90కిపైగా యుద్ధ ట్యాంకులు, సుమారు 330 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, రాడార్ సిస్టమ్‌ను కూడా ఎయిర్ లిఫ్టు చేసింది. ఆయుధ […]

- గల్వాన్ ఘర్షణ తర్వాత భారీగా మోహరింపు
- వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు
- 90 కంటే ఎక్కువ యుద్ధ ట్యాంకులు కూడా
Ladakh | విధాత: మూడేండ్ల క్రితం గాల్వాన్ (Galvan) లోయలో చైనా- భారత్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇప్పటివరకు 68,000 మందికిపైగా సైనికులను తూర్పు లడఖ్‌కు భారత వైమానిక దళం తరలించింది. 90కిపైగా యుద్ధ ట్యాంకులు, సుమారు 330 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, రాడార్ సిస్టమ్‌ను కూడా ఎయిర్ లిఫ్టు చేసింది. ఆయుధ పరికరాలు, సామగ్రి, ఇతర వ్యవస్థలను పెద్దమొత్తంలో చేరవేసింది.
2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య అత్యంత తీవ్రమైన ఘర్షణలో 20 మంది భారత సైనికులు (Indian soldiers) వీరమరణం పొందగా, చైనా నుంచి పెద్ద సంఖ్యలో చనిపోయారు. నాటి నుంచి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధవిమానాల (Fighter planes) పహారాతోపాటు శత్రువుల వ్యూహాలపై భారత బలగాలు 24/7 నిఘా పెట్టాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిఘా ఏర్పాటుచేసినట్టు రక్షణశాఖ తెలిపింది.
ప్రత్యేక ఆపరేషన్ కింద నియంత్రణ రేఖ వెంబడి వివిధ నిర్మానుష్య ప్రాంతాల్లో వేగంగా మోహరించడం, చాలా తక్కువ సమయంలో అక్కడికి దళాలు చేరుకోవడం, ఆయుధాలు తరలించడం వంటివి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా (China) కార్యకాలాపాలపై నిఘా ఉంచేందుకు యుద్ధ విమానాలతోపాటు ఆధునాతన సాంకేతికతను కూడా అక్కడ ఏర్పాటుచేసినట్టు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా ఉన్న భారత సైన్యంలోని పలు విభాగాలను నుంచి 68,000 మంది సైనికులు, 90 ట్యాంకులు, దాదాపు 330 వాహనాలు, రాడార్ సిస్టమ్‌లు, ఫిరంగి తుపాకులు వైమానికి దళం తరలించింది. రాఫెల్, మిగ్-29 విమానాలతో సహా అనేక ఫైటర్ జెట్లు యుద్ధ విమాన గస్తీ కోసం మోహరించారు. చైనా దళాల స్థానాలు, కదలికలను ఖచ్చితంగా పర్యవేక్షించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.