కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారు.. అమ్మాయిలపై ఐఏఎస్ ఫైర్
విధాత : బీహార్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భ్రమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శానిటరీ ప్యాడ్‌తో పాటు కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారని ఐఏఎస్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమ్మాయిల స్వశక్తే.. బీహార్ అభివృద్ధి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. […]

విధాత : బీహార్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భ్రమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శానిటరీ ప్యాడ్‌తో పాటు కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారని ఐఏఎస్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమ్మాయిల స్వశక్తే.. బీహార్ అభివృద్ధి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. బీహార్ ప్రభుత్వం రూ. 20 నుంచి రూ. 30 ధరకే శానిటరీ ప్యాడ్స్‌ను ఇవ్వగలదా అని ప్రశ్నించింది. ఆ అమ్మాయి ప్రశ్నపై హర్జోత్ కౌర్ మండిపడ్డారు. జీన్స్‌లు కూడా ఇవ్వాలని, ఆ తర్వాత అందమైన షూ కూడా ఇవ్వాలని అడిగేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారని ఐఏఎస్ ఆఫీసర్ నోరు పారేసుకున్నారు.
ఈ వ్యాఖ్యలపై విద్యార్థిని కూడా తీవ్రంగా స్పందించారు. ప్రజల ఓట్లతోనే ప్రభుత్వాలు నడుస్తాయన్న విషయం మరిచపోవద్దు అని సూచించారు. దీనికి కూడా ఆ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయకుండి. అప్పుడు పాకిస్తాన్‌లా తయారవుతుంది. మీరు డబ్బు కోసమే ఓట్లు వేస్తున్నారా? అని హర్జోత్ కౌర్ ప్రశ్నించారు.
ఈ వివాదం అంతటితోనే ఆగలేదు. మరో అమ్మాయి మాట్లాడుతూ.. మా స్కూల్లో టాయిలెట్లను ధ్వంసం చేశారు. తరుచుగా ఆ టాయిలెట్లలోకి అబ్బాయిలు వస్తున్నారని చెప్పింది. ఈ మాటలను కూడా ఆమె తప్పుబట్టారు. మీ ఇంట్లో ఏమైనా మీకు సెపరేట్ టాయిలెట్ ఉందా? అని ఐఏఎస్ ఆఫీసర్ నిప్పులు చెరిగారు. హర్జోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.