Allu Arjun | నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి

కంచర్ల కన్వెన్షన్‌ ప్రారంభిన అర్జున్‌.. భారీగా తరలివచ్చిన జనం Allu Arjun | విధాత : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో శనివారం సందడి చేశారు. తన మామ, బీఆరెస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలోని పెద్ద వూర మండలంలోని చింతపల్లి గ్రామం భట్టుగూడెం వద్ద నిర్మించిన కంచర్ల కన్వేన్షన్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. అల్లు అర్జున్ రాకను తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలిరావడంతో […]

  • Publish Date - August 19, 2023 / 09:39 AM IST
  • కంచర్ల కన్వెన్షన్‌ ప్రారంభిన అర్జున్‌.. భారీగా తరలివచ్చిన జనం

Allu Arjun | విధాత : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో శనివారం సందడి చేశారు. తన మామ, బీఆరెస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలోని పెద్ద వూర మండలంలోని చింతపల్లి గ్రామం భట్టుగూడెం వద్ద నిర్మించిన కంచర్ల కన్వేన్షన్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు.

అల్లు అర్జున్ రాకను తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా అల్లు అర్జున్ ఏదైనా మాట్లాడుతారేమోనన్న అభిమానుల అంచనాలకు భిన్నంగా ఆయన కేవలం ఫంక్షన్ హాల్ నిర్మించిన మామకు అభినందనలని, తనకోసం వచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలని చెప్పి అభివాదం చేసి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహారెడ్డి, కుమారుడు, కూతురు కూడా వచ్చారు.

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి 2014ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆరెస్ అభ్యర్ధిగా పోటీ చేసి, టీడీపి అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో ఓడారు. ఎన్నికల అనంతరం మంచిరెడ్డి బీఆరెస్‌లో చేరిపోవడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు కంచర్ల దూరంగా ఉన్నారు. అనంతరం ఆయన తన సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్‌లో తన కార్యక్రమాలు ముమ్మరం చేసి రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.

తాజాగా చంద్రశేఖర్‌రెడ్డి కంచర్ల కన్వెన్షన్‌ పేరుతో 1000 మందికి సరిపడే ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు నామమాత్ర ధరకు వివాహాది శుభాకార్యాలకు కేటాయించారు. ఈ ఫంక్షన్ హాల్‌ను తన అల్లుడైన సినీ హీరో అల్లు అర్జున్‌తో ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీతో పాటు పదివేల మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.